iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు స్టార్ హీరోయిన్ గట్టి వార్నింగ్.. అలాంటివి రిపీటైతే..

  • Author Soma Sekhar Published - 01:06 PM, Sun - 26 November 23

తన పేరును తప్పుగా ఉపయోగించుకుంటున్న కొన్ని ఫ్యాన్ పేజీ, ఫ్యాన్ క్లబ్ ల తీరుపై మండిపడింది స్టార్ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

తన పేరును తప్పుగా ఉపయోగించుకుంటున్న కొన్ని ఫ్యాన్ పేజీ, ఫ్యాన్ క్లబ్ ల తీరుపై మండిపడింది స్టార్ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 01:06 PM, Sun - 26 November 23
ఫ్యాన్స్ కు స్టార్ హీరోయిన్ గట్టి వార్నింగ్.. అలాంటివి రిపీటైతే..

తమ అభిమాన హీరో, హీరోయిన్లపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు డైహార్డ్ ఫ్యాన్స్. తమ హీరో గొప్ప అంటే.. తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ.. వారిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపిస్తుంటారు. అభిమాన నటీ, నటులను పొగడటం కోసం ఇతర నటీ, నటులను తక్కువ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఇలా తన పేరును తప్పుగా ఉపయోగించుకుంటున్న కొన్ని ఫ్యాన్ పేజీ, ఫ్యాన్ క్లబ్ ల తీరుపై మండిపడింది స్టార్ హీరోయిన్. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే రిపోర్ట్ చేస్తానంటూ హెచ్చరించింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఫ్యాన్స్ కు వార్నింగ్ ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

పరిణీతి చోప్రా.. 2011లో బాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. శుద్ధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, డిష్యూం, కేసరి, సైనా, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది పరిణీతి చోప్రా. ఇక ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లాడి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. పలు ఫ్యాన్ క్లబ్స్, ఫ్యాన్ పేజీల తీరుపై ఈ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అభిమానుల నటీ, నటులను పొగడటం కోసం కొన్ని ఫ్యాన్ పేజీలు, క్లబ్స్ తన పేరును తప్పుగా వాడుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేసింది ఈ భామ.

ఈ విషయంపై పరిణీతి చోప్రా మాట్లాడుతూ..”నా పేరును ఉపయోగించుకుని కొన్ని ఫ్యాన్ పేజీలు, ఫ్యాన్ క్లబ్స్ వారి అభిమాన నటీ, నటులకు ఫేవర్ గా పోస్టులు క్రియేట్ చేస్తున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఇక ఆ పోస్టుల్లో ఎలాంటి వాస్తవాలూ లేవు. నేను ఏ ఒక్కరిని అభినందించడానికి ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటి పోస్ట్ లు మరోసారి రిపీట్ అయితే రిపోర్ట్ చేస్తా” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సదరు ఫ్యాన్ పేజీలు, ఫ్యాన్ క్లబ్స్ వాటిని పోస్ట్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని, అప్పుడే వాటిని షేర్ చేయాని వార్నింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఇన్ని రోజులు వాటిని చూసిన పరిణీతి.. ఉన్నట్లుండి ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అనేది మాత్రం పూర్తిగా వివరించలేదు. మరి పరిణీతి చోప్రా ఫ్యాన్ పేజీలకు వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

marsbahis girişjojobetjojobet giriş