iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో యూత్‌కు నిద్రలేకుండా చేస్తున్న.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా?

  • Published Sep 02, 2024 | 6:31 PM Updated Updated Sep 02, 2024 | 6:31 PM

సోషల్ మీడియాలో యూత్‌కు నిద్రలేకుండా చేస్తున్న.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా? శ్రీ విష్ణు, రామ్ పోతినేని, ఉపేంద్ర వంటి స్టార్స్ పక్కన యాక్ట్ చేసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

సోషల్ మీడియాలో యూత్‌కు నిద్రలేకుండా చేస్తున్న.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా? శ్రీ విష్ణు, రామ్ పోతినేని, ఉపేంద్ర వంటి స్టార్స్ పక్కన యాక్ట్ చేసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

  • Published Sep 02, 2024 | 6:31 PMUpdated Sep 02, 2024 | 6:31 PM
సోషల్ మీడియాలో యూత్‌కు నిద్రలేకుండా చేస్తున్న.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా?

వర్షం మూవీతో ప్రభాస్‪కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శోభన్. ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు యంగ్ హీరోలు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. సంగీత్ ఇప్పుడిప్పుడే తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుండగా.. సంతోష్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. సంతోష్ నటించిన చిత్రాల్లో ఒకటి పేపర్ బాయ్. 2018లో నటించిన ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది.. నిర్మాతగా మారి ఈ మూవీని తెరకెక్కించాడు. అతడే కథను అందించడం విశేషం. ఇందులో రియా సుమన్, తాన్య హోప్స్ హీరోయిన్లుగా నటించారు. ధరణి, రవి (హీరో హీరోయిన్లు)ని కలిపేందుకు ప్రయత్నించిన మేఘ క్యారెక్టర్‌లో మెప్పించింది తాన్య.

తాన్య హోప్ బెంగళూరులో పెద్ద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి రవి పురవంకర ఓ బిజినెస్ మ్యాన్. బెంగుళూరులోని ఉన్నత విద్యనభ్యసించిన ఆమె.. ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలలో గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించింది. కానీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పూణెలోని టియారా ట్రైనింగ్ స్టూడియోలో మోడలింగ్ శిక్షణ తీసుకున్న తాన్య.. 2015లో, ఫెమినా మిస్ ఇండియా కోల్‌కతాను గెలుచుకుంది. 2016లో శ్రీ విష్ణు కథానాయకుడిగా వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. రామ్ పోతినేని నేను శైలజ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఆ తర్వాత పేపర్ బాయ్ చిత్రంలో నటించింది.

ఇటు తాడం మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ రెండు ఇండస్ట్రీల్లో కొనసాగుతూ.. రవితేజ డిస్కో రాజా, ఇదే మా కథ చిత్రాల్లో నటించింది. ఇక కన్నడలో కూడా ఉపేంద్ర హోమ్ మినిస్టర్ చిత్రంలో యాక్ట్ చేసింది. కబ్జాలో ఓ స్పెషల్ పాటలో మెరిసింది. ఇక వరుసగా తమిళంలో ఆఫర్స్ రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. తమిళంలో వాల్లన్, గోల్ మాల్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది లేబల్ వెబ్ సిరీస్‌లోనూ ఆకట్టుకుంది. ఆమె నటి మాత్రమే కాదు.. గుర్రపు స్వారీలో కూడా దిట్ట. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలతో కాక రేపుతూ ఉంటుంది.ఆమె పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇటు సినిమాలోనే కాదు ఇన్ స్టాలో కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Tanya Hope (@hope.tanya)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet