iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ విన్నర్‌ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి? అసలు నిజం.. క్లారిటీ!

  • Published Jan 31, 2024 | 3:50 PM Updated Updated Jan 31, 2024 | 4:11 PM

Pallavi Prashanth, Barrelakka: బర్రెలక్క, పల్లవి ప్రశాంత్‌ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతం ఇదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం..

Pallavi Prashanth, Barrelakka: బర్రెలక్క, పల్లవి ప్రశాంత్‌ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతం ఇదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 31, 2024 | 3:50 PMUpdated Jan 31, 2024 | 4:11 PM
బిగ్‌బాస్‌ విన్నర్‌ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి? అసలు నిజం.. క్లారిటీ!

బిగ్‌ బాస్‌-7 తెలుగు విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌తో పల్లవి ప్రశాంత్‌కు విపరీతమైన క్రీజ్‌ వచ్చింది. అయితే.. బిగ్‌ బాస్‌ ముగిసిన తర్వాత అదే స్థాయిలో పల్లవి ప్రశాంత్‌ వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటికి వస్తున్న క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించాడని, అతని అభిమానులు ఆర్టీసీ బస్సుపై, అలాగే మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అమర్‌ ఫ్యామిలీ వెళ్తున్న కారుపై కూడా దాడి చేయడంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని జైలుకు కూడా పంపారు. దీంతో.. సోషల్‌ మీడియాలో, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పల్లవి ప్రశాంత్‌ పేరు మారుమోగిపోయింది.

ఇక మరోవైపు బర్రెలక్క అలియాస్‌ శిరీష కూడా ఊహించని పాపులారిటీని చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసుకుంటూ ఉండే శిరీష.. ఒక సారి తెలంగాణలో నిరుద్యోగంపై చేసిన ఒక రీల్‌ వైరల్‌ కావడంతో ఫేమస్‌ అయింది. అక్కడి నుంచి బర్రెలక్కగా ఆమెకు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ వచ్చింది. ఆ క్రేజ్‌తోనే ఆమె ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమెకు దాదాపు ఐదు వేల పైచిలుకు ఓట్లు కూడా వచ్చాయి. ఎమ్మెల్యేగా ఆమె పోటీకి దిగడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించింది.

Barrelakka's wedding with a farmer's child

ఇలా అటు పల్లవి ప్రశాంత్‌, ఇటు బర్రెలక్క ఇద్దరూ సోషల్‌ మీడియాలో భారీ క్రీజ్‌ ఉన్న వాళ్లే. అయితే.. ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించి ఒక కామన్‌ విషయం వైరల్‌గా మారింది. అదేంటంటే.. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సోషల్‌ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. కానీ, దీనిపై ఎలాంటి అధికారక ప్రకటనలేదు. ప్రశాంత్‌ కానీ, బర్రెలక్క కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒకే వేదికపై కలిసిన దాఖలాలు కూడా లేవు. అయినా కూడా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్‌ ఎలా వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు. చాల మంది ఈ విషయం నిజం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుబిడ్డ, బర్రెలక్క పెళ్లి చేసుకుంటారనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş