మన దేశంలో ప్రజలకు అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ అంటే క్రికెట్, సినిమాలు అనే చెప్పాలి. అందుకే క్రికెటర్లు, మూవీ స్టార్స్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు మాత్రం ప్రజల జీవనంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే ఒక చిత్రం బయటకు రావడం అంటే అంత ఈజీ కాదు. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయి రిలీజ్ అయ్యే దాకా చాలా తతంగమే ఉంటుంది. ఇలా కంప్లీట్ అయిన మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ప్రమోషన్స్ చేయకపోతే మూవీకి అంతగా బజ్ రాదు. అందుకే ఈ రోజుల్లో పబ్లిసిటీపై మేకర్స్ అందరూ బాగా ఫోకస్ చేస్తున్నారు.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలకైతే పబ్లిసిటీ కోసమే దాదాపు నెలన్నర, రెండు నెలల టైమ్ కేటాయిస్తారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రెస్ మీట్లతో సినిమాపై బజ్ పెంచుతారు. ఈ ప్రోగ్రామ్స్ ఎంత సక్సెస్ అయితే సినిమాపై ప్రేక్షకుల్లో అంత బజ్ నెలకొంటుంది. క్రేజ్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయి. అదే చిన్న చిత్రాలకైతే ప్రమోషన్స్, పబ్లిసిటీతో ఆడియెన్స్‌లో ఆసక్తిని కలిగించాలి. అలాగే సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌తో వారి మనసులు దోచుకోవాలి. అప్పుడు గానీ ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. అయితే కొందరు నటులు రెమ్యూనరేషన్ తీసుకున్నా ప్రమోషన్స్‌కు రారనే ఒక అపప్రద ఉంది. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక హీరో విషయంలో ఇదే జరిగింది.
ప్రముఖ మలయాళ నటుడు కున్‌చకో బొబన్పై నిర్మాత సువిన్ కె వర్కీ ఫైర్ అయ్యారు. శుక్రవారం రిలీజైన ‘పద్మిణి’ అనే తమ సినిమా ప్రమోషన్స్‌లో హీరో పాల్గొనకపోవడంపై ఆయన అసహనానికి లోనయ్యారు. 25 రోజుల షూటింగ్ కోసం కున్‌చకో రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని ప్రొడ్యూసర్ సువిన్ తెలిపారు. కున్‌చకో సతీమణి నియమించిన మార్కెటింగ్ కన్సల్టెంట్ తమ సినిమా రా ఫుటేజీని చూసి.. అన్ని ప్రమోషన్ ప్రోగ్రామ్స్‌ను రద్దు చేసేసిందన్నారు. ఆ హీరో యాక్ట్ చేసిన మూడు సినిమాల నిర్మాతలకూ ఇదే పరిస్థితి ఎదురైందన్నారు సువిన్. కాగా, ‘నన్ తాన్ కేసుకోడు’, ‘2018’ మూవీస్‌తో కున్‌చకో బొబన్ తెలుగు వారికీ సుపరిచితమే.
Shocking #FB post from producer @suvinkvarkey, of #Padmini ( released July 14) on its hero #KunchackoBoban regarding lack of cooperation in promoting the film and his unprofessional behaviour by abandoning the film at time of release and going on a European holiday! 👇 pic.twitter.com/WdJECzX3ef
— Sreedhar Pillai (@sri50) July 15, 2023