iDreamPost
android-app
ios-app

నేను సింగిల్.. జస్ట్ 23.. ఓయ్ రీ రిలీజ్ డ్యాన్సర్ బ్యాగ్రౌండ్ ఇదే!

  • Published Feb 20, 2024 | 10:05 PM Updated Updated Feb 20, 2024 | 10:05 PM

Oye Movie Re Release Dancer Mounika Patnaik: ఓయ్ మూవీ రీ రిలీజ్ లో ఓ యువతి థియేటర్ లో వేసిన డ్యాన్స్ రెండు రాష్ట్రాను షేక్ చేసింది. మరి ఆ అమ్మాయి ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Oye Movie Re Release Dancer Mounika Patnaik: ఓయ్ మూవీ రీ రిలీజ్ లో ఓ యువతి థియేటర్ లో వేసిన డ్యాన్స్ రెండు రాష్ట్రాను షేక్ చేసింది. మరి ఆ అమ్మాయి ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

  • Published Feb 20, 2024 | 10:05 PMUpdated Feb 20, 2024 | 10:05 PM
నేను సింగిల్.. జస్ట్ 23.. ఓయ్ రీ రిలీజ్ డ్యాన్సర్ బ్యాగ్రౌండ్ ఇదే!

సిద్ధార్థ్ నటించిన ఓయ్ మూవీ రీ రిలీజ్ లో ఎంతంటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. మెుదటిసారి విడుదలైనప్పటి కంటే.. తాజాగా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఓయ్ మూవీ రీ రిలీజ్ కాగా.. ఈ మూవీని చూడ్డానికి వచ్చిన ఓ యువతి వేసిన డ్యాన్స్ రెండు రాష్ట్రాను షేక్ చేసింది. చీరకట్టుకుని థియేటర్ లో ఓ అద్భుతమైన డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసిన బ్యూటీ పేరు మౌనిక పట్నాయక్. ఈ అమ్మాయిది వైజాగే. మరి తన డ్యాన్స్ తో కుర్రకారు గుండెల్ని మెలిపెట్టిన మౌనిక బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మౌనిక పట్నాయక్.. ఈ పేరు మీకు తెలియకపోవచ్చు. కానీ ఓయ్ మూవీ రీ రిలీజ్ లో డ్యాన్స్ వేసిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుకువస్తుంది. ఆ రోజు థియేటర్ లో ఓయ్ మూవీలోని అన్ని పాటలకు డ్యాన్స్ చేసి.. అందరిని ఫిదా చేసింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. మరి మౌనిక పట్నాయక్ కు బ్యాగ్రౌండ్ ఏంటో ఓసారి చూద్దామా. ఈ అమ్మాయిది ఎక్కడో కాదు.. మన వైజాగే. MBA పూర్తి చేసిన ఈ బ్యూటీ మంచి క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్. ఓ స్కూల్ లో కూచిపూడి డ్యాన్స్ టీచర్ గా పనిచేస్తోంది. 2023లో మిస్ విశాఖగా కూడా ఎంపికైంది. క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఇటీవలే టూరిజం డే నాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా వచ్చిన కార్యక్రమంలో కూడా మౌనిక డ్యాన్స్ వేసింది.

ఇదిలా ఉండగా.. తాను ఇలా ఫేమస్ అవ్వడంపై ఆరోజు చీరకట్టుకుని డ్యాన్స్ వేయడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది.”నేను స్వతహాగానే ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్ ని. నాకింకా పెళ్లికాలేదు. ఐయామ్ జస్ట్ 23. నేను ఫ్రీ బర్డ్. ఫిబ్రవరి 14న సినిమాకు బాయ్ ఫ్రెండ్ తో వెళ్లలేదు. లవర్స్ డే అని ఓయ్ సినిమాకి పోలేదు. నాకు సినిమాలు ఆ సినిమా అంటే పిచ్చి. పైగా నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్ ను. ఇక నాకు పాట వినిపిస్తే.. నా కాళ్లు కుదురుగా ఉండవు. థియేటర్ లో ఇష్టమైన సాంగ్స్ రావడంతో.. డ్యాన్స్ చేయాలనిపించింది. ఇక చీర అంటారా.. స్కూల్ కు వెళ్లాలనే చీర కట్టుకుని వచ్చాను. నన్ను ఇంత ఫేమస్ చేసిన మీ అందరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక ఈ వీడియో తీసింది ఎవరో తనకు మెసేజ్ పెట్టాలని రిక్వెస్ట్ చేసింది మౌనిక.

 

View this post on Instagram

 

A post shared by mana_Visakhapatnam (@mana_visakhapatnam)

 

View this post on Instagram

 

A post shared by Mounika Patnaik🦋 (@_hippy._sunshine._)

ఇదికూడా చదవండి: MCU తరహాలో కల్కి యూనివర్స్! 9 సినిమాలు.. ఎంతో మంది స్టార్స్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş