iDreamPost
android-app
ios-app

‘ఓయ్’ మూవీ డైరెక్టర్‌పై నెటిజన్ ఓవర్ యాక్షన్! రియాక్షన్ వైరల్!

  • Published Feb 02, 2024 | 4:02 PM Updated Updated Feb 02, 2024 | 4:02 PM

సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు సెలబ్రెటీలను ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు.. ఓ డైరెక్టర్ ని నెటిజన్ అసభ్యంగా తిట్టాడు. దానికి ఆ డైరెక్టర్ నెటిజన్ కి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు సెలబ్రెటీలను ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు.. ఓ డైరెక్టర్ ని నెటిజన్ అసభ్యంగా తిట్టాడు. దానికి ఆ డైరెక్టర్ నెటిజన్ కి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు.

  • Published Feb 02, 2024 | 4:02 PMUpdated Feb 02, 2024 | 4:02 PM
‘ఓయ్’ మూవీ డైరెక్టర్‌పై నెటిజన్ ఓవర్ యాక్షన్! రియాక్షన్ వైరల్!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీలకు ప్రైవసీ లేకుండా పోయిందని అంటున్నారు. ఊరు, పేరు లేని కొంతమంది నెటిజన్లు తమను ఏం చేస్తారు లే అన్న ధీమాతో సెలబ్రెటీస్ పై ఇష్టమొచ్చిన కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా వెండితెర, బుల్లితెర నటీమణులను  ఆకతాయిలు బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది సెలబ్రెటీలు వాటిని సిల్లిగా తీసుకుంటున్నా.. ఇంకొంతమంది మాత్రం సీరియస్ గా తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల వరకు వెళ్తున్నారు. సోషల్ మాద్యమం వేదికగా ఓ డైరెక్టర్ ని నెటిజన్ దారుణంగా తిట్టాడు. దానికి ఆ డైరెక్టర్ రియక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఓయ్’ మూవీ రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందు కోసం డైరెక్టర్ ఆనంద్ రంగా నెటిజన్లతో కాసేపు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి ఆనంద్ రంగా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆనంద్ రంగా రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  సిద్దార్థ్, శామిలి జంటగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ‘ఓయ్’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం మంచి లవ్ స్టోరీగా.. క్లాసికల్ హిట్ గా నిలిచింది. కాకపోతే కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఇందులో పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిజాంలో ఓయ్ మూవీ రీ రిలీజ్ ఉండనుందని డైరెక్టర్ ఆనంద్ రంగా ట్విట్టర్ వేదికగా పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఈ పోస్టర్ కింద ఒక నెటిజన్ ‘ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావురా’ అంటూ కామెంట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్ వస్తే ఎవరైనా సెలబ్రెటీ కోపంతో ఊగిపోతుంటారు.. కానీ ఆనందర్ రంగా మాత్రం నవ్వుతూ ఉన్న ఎమోజీ షేర్ చేశాడు. వెంటనే సదరు నెటిజన్ తన తప్పు తెలుసుకొని సారీ సార్ కాలింగ్ యూ గుండు అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి ఆనంద్ రంగా పర్వాలేదు.. అది నిజమే కదా అంటూ మరోసారి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు డైరెక్టర్ ఆనంద్ రంగా రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి కామెంట్స్ చేసినా ఇంత సహనంగా రియాక్షన్ ఇచ్చారు.. మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet