Krishna Kowshik
బ్రోచెవారెవరురా తర్వాత శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వచ్చిన చిత్రం ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూళ్లు చేసిందంటే..?
బ్రోచెవారెవరురా తర్వాత శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వచ్చిన చిత్రం ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూళ్లు చేసిందంటే..?
Krishna Kowshik
అల్లరి నరేష్ తర్వాత ఫన్, ఫ్యామిలీ అండ్ ఎంటర్‌టైన్ మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు శ్రీ విష్ణు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తేనే, మరో వైపు ఫన్ చిత్రాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఓం భీమ్ బుష్ అంటూ ముందుకు వచ్చాడు. బ్రోచెవారెవరురా తర్వాత రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి కామెడీ పండించాడు శ్రీవిష్ణు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిలేరియస్‌గా నవ్విస్తోంది. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ చేసి మెప్పించాడు. తొలి ఆట నుండే మంచి రివ్యూస్ రాబట్టుకుంది. క్రిష్ పాత్రలో శ్రీ విష్ణు నటన, రాహుల్ రామకృష్ణ కౌంటర్లు, ప్రియదర్శి భయం ఈ పిక్చర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువి క్రియేషన్స్ సమర్పణలో.. వి సెల్యూలయిడ్, సునీల్ బలుసు నిర్మించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు సినిమాలకు డిమాండ్ ఉంది. సామజవరగమన హిట్ కొట్టడంతో.. మార్కెట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఓం బుష్ చిత్రానికి బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని వినికిడి. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే.. రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీ విష్ణు నటించిన సినిమాల్లో.. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 800లకు పైగా స్క్రీన్లలో విడుదలయ్యింది. అదే విధంగా ఓవర్సీస్‌లోకూడా 400 స్క్రీన్లపై రిలీజయ్యింది. మొత్తంగా 1300 స్క్రీన్లలో విడుదలయ్యింది. కాగా, తొలి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మరో బడా చిత్రం పోటీ లేకపోవడం కూడా ఓం భీమ్ బుష్ చిత్రానికి కలిసి వచ్చింది.
తొలి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ సినిమా మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాటీకి 45 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3 నుండి రూ. 4 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం అంటే మామలూ విషయం కాదు. మరో హిట్టు శ్రీ విష్ణు ఖాతాలో పడినట్లే అని భావిస్తున్నారు సినీ పండితులు. ఇక వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయి. ఇక ఇందులో ప్రీతి ముకుందన్, కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించగా.. ఆదిత్య మీనన్,శ్రీకాంత్ అయ్యంగార్,రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు.