iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది.. కుర్రాళ్ల క్రష్ హీరోయిన్.. సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తుంది

  • Published Sep 18, 2024 | 6:38 PM Updated Updated Sep 18, 2024 | 6:38 PM

ఈ చిన్నది.. ఇప్పుడు స్టార్ బ్యూటీ. ఒక్క మూవీతోనే కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళుతుంది. సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తుంది. ఇంతకు ఆ నటి ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నది.. ఇప్పుడు స్టార్ బ్యూటీ. ఒక్క మూవీతోనే కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళుతుంది. సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తుంది. ఇంతకు ఆ నటి ఎవరో గుర్తుపట్టండి.

  • Published Sep 18, 2024 | 6:38 PMUpdated Sep 18, 2024 | 6:38 PM
ఈ చిన్నది.. కుర్రాళ్ల క్రష్ హీరోయిన్.. సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తుంది

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప.. ఇప్పడు బ్యూటీఫుల్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. చంద్రబింబం వంటి ముఖం, చక్కటి ఎక్స్ ప్రెషన్స్‌తో, మంచి కట్టుబొట్టుతో మది దోచేసింది. ఓ ప్రేమ కథా చిత్రంలో ఆమె నటనను చూసి.. ఇలాంటి లవరే కదా మనకు కావాల్సింది అనుకున్నారు అబ్బాయిలు. ఇంతకు ఆమె ఎవరంటే.. మాళవిక మనోజ్. తమిళ చిత్రం జో మూవీ హీరోయిన్. ఇందులో రియో రాజ్ లవర్‌గా యాక్ట్ చేసింది. అతడ్ని పిచ్చిగా ప్రేమించి, పేరెంట్స్ కాదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఇందులో ఆమె క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లీష్ అయ్యింది. 2023 నవంబర్ నెలలో వచ్చిన జో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు స్టార్ సెలబ్రిటీల నుండి అప్లాజ్ వచ్చాయి. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఓటీటీలో సందడి చేయడంతో.. టాలీవుడ్ లో కూడా ఆమెకు ఫేమ్ వచ్చింది. ఇంతకు ఆమె సినీ బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

మాళవిక మనోజ్ కూడా కేరళ కుట్టీనే. కానీ ఆమె సౌదీ అరేబియాలో పెరిగింది. ఆమె చిన్నప్పటి నుండి నాట్యంపై మక్కువ పెంచుకుంది. శాస్త్రీయ నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె తన పాఠశాల విద్యను సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. తిరిగి ఇండియాకి వచ్చి సినిమాల్లో నటించింది. ఆమె మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా తెరంగేట్రమైంది. 2022లో వచ్చిన మాథ్యూ థామస్‌(లియోలో విజయ్ కొడుకు)తో కలిసి ప్రకాశన్ పరక్కట్టేలో తొలిసారిగా నటించింది మాళవిక. ఈ సినిమాతో మంచి మార్కులు వేయించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. నాయాడీ అనే హారర్ మూవీలో నటించింది. ఇదే ఆమెకు జోలో ఆఫర్ వచ్చేలా చేసింది.

Joe Heroine

ఇక జో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్లతోనే పలికించిన హవాభావాలకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇవి ఆమెకు వరుస అవకాశాలను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆనంద్ శ్రీబాల అనే మలయాళ చిత్రం చేస్తుంది. ఇది మిస్టరీ థ్రిల్లర్.. త్వరలో విడుదల కాబోతుంది. మరో మలయాళ చిత్రం కూడా చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. సుహాస్ సరసన ఓ భామ అయ్యో రామ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నేరుగా తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవే కాకుండా మరోసారి రియో రాజ్ (జో మూవీ హీరో)తో కలిసి మరో మూవీ చేయబోతుంది. మొత్తానికి వరుస షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కావాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Thaha Photography (@thaha_photography)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş