iDreamPost
android-app
ios-app

OG రేట్స్ , ప్రమోషన్స్ ఎంత వరకు వచ్చినట్టు !

  • Published Sep 09, 2025 | 4:56 PM Updated Updated Sep 09, 2025 | 4:56 PM

సమయం దగ్గర పడే కొద్దీ ప్రేక్షకులలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకు ఉన్న హైప్ గురించి తెలియనిది కాదు. పవన్ అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు.. మొత్తం ఇండస్ట్రీ లెక్కలను సరిచేయడానికి వచ్చేస్తుంది ఓజి.

సమయం దగ్గర పడే కొద్దీ ప్రేక్షకులలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకు ఉన్న హైప్ గురించి తెలియనిది కాదు. పవన్ అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు.. మొత్తం ఇండస్ట్రీ లెక్కలను సరిచేయడానికి వచ్చేస్తుంది ఓజి.

  • Published Sep 09, 2025 | 4:56 PMUpdated Sep 09, 2025 | 4:56 PM
OG రేట్స్ , ప్రమోషన్స్ ఎంత వరకు వచ్చినట్టు !

సమయం దగ్గర పడే కొద్దీ ప్రేక్షకులలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకు ఉన్న హైప్ గురించి తెలియనిది కాదు. పవన్ అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు.. మొత్తం ఇండస్ట్రీ లెక్కలను సరిచేయడానికి వచ్చేస్తుంది ఓజి. సరిగ్గా ఇంకొక్క పదిహేను రోజుల్లో థియేటర్స్ లో పండగ వాతావరణం నెలకొననుంది. సినిమాకు ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి ప్రమోషన్స్ , రేట్స్ విషయంలో ఓజి ఎంతవరకు వచ్చింది అనే విషయాలను చూసేద్దాం.

ఓజి సినిమాకు తగినట్టే రేట్స్ కూడా అలానే కేటాయించారు. ప్రీమియర్స్ కు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు రేట్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. మొదటి వారం మాత్రమే ఇలా పెంచాలని అనుకుంటున్నారట. దీనికోసం నిర్మాతల అంతా కలిసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హరి హర వీరమల్లు సమయంలో కూడా ఇదే జరిగింది. కానీ ప్రస్తుతం ఓజి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సిఉంది.

ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే.. అసలు ఓజికి ప్రమోషన్స్ తో కూడా పనిలేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉండాల్సిన దానికంటే ఒకింత ఎక్కువ బజ్ ఏ ఉంది. సో హరి హర వీరమల్లు లా పవన్ మైక్ పట్టుకుని మీడియా ముందుకు వస్తారన్న గ్యారంటీ అయితే లేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం కనిపించే అవకాశాలు బానే ఉన్నాయి. హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుందట. సో ఇక ఉన్న సమయంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.