iDreamPost
android-app
ios-app

OG క్రేజీ డిమాండ్ వెనుక దేవర సాయం.. అది NTR రేంజ్

  • Published Oct 03, 2024 | 3:42 PM Updated Updated Oct 03, 2024 | 3:42 PM

OG Movie Demand : దేవర థియేటర్స్ లో దూసుకుపోతుంది. థియేట్రికల్ ఎండ్ లోపు వెయ్యి కోట్లు దాటేయడం ఖాయం. అయితే ఇప్పడు ఈ ఎఫెక్ట్ తర్వాత వచ్చే సినిమాలపై పడుతుందా.. పవన్ కళ్యాణ్ ఓజికి, దేవరకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

OG Movie Demand : దేవర థియేటర్స్ లో దూసుకుపోతుంది. థియేట్రికల్ ఎండ్ లోపు వెయ్యి కోట్లు దాటేయడం ఖాయం. అయితే ఇప్పడు ఈ ఎఫెక్ట్ తర్వాత వచ్చే సినిమాలపై పడుతుందా.. పవన్ కళ్యాణ్ ఓజికి, దేవరకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 03, 2024 | 3:42 PMUpdated Oct 03, 2024 | 3:42 PM
OG క్రేజీ డిమాండ్ వెనుక దేవర సాయం.. అది NTR రేంజ్

వీకెండ్స్ లోనే కాకుండా.. వీక్ డేస్ లోను దేవర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 396 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు సమాచారం. ఇక ఇప్పుడు దసరా సెలవులు స్టార్ట్ అవ్వడంతో.. నేటి నుంచి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అందులోను వచ్చే వారం నుంచి సినిమాలో దావుది సాంగ్ ను కూడా యాడ్ చేస్తున్నట్లు టాక్. ఇదే కనుక జరిగితే తారక్ గ్రేస్ డ్యాన్స్ ను చూసేందుకు.. మరోసారి థియేటర్స్ కు అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇదంతా సరే,
ఇప్పుడు తారక్ తర్వాత వచ్చే సినిమాలకు గట్టి టార్గెట్ నే ఫిక్స్ చేస్తున్నారు. దీనితో ఇప్పుడు తర్వాత రాబోయే స్టార్స్ సినిమాలకు క్రేజ్ బాగా పెరుగుతుంది. దేవర సినిమా కారణంగా పవన్ కళ్యాణ్ ఓజి మూవీ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరి ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలియనిది కాదు. అటు ప్రజాసేవలో బిజీగా ఉంటూనే.. ఇటు అభిమానులను మెప్పించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్.. సగంలో ఆగిపోయిన షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. ఓజి, హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలకు కూడా డిమాండ్ బాగానే ఉంది . అయితే దేవర సినిమా రిలీజ్ కు ముందే ఓజి మూవీ థియేట్రీకల్ డీల్ ముగిసింది. కానీ ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఓజి మూవీ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజి థియేట్రికల్ రైట్స్ రూ. 110 కోట్లకు పూర్తి చేశారట మేకర్స్. కానీ ఇప్పుడు దేవర భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో.. ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు నిర్మాతలు ఏకంగా రూ.150 కోట్లు చెప్తున్నట్లు సమాచారం. అయినా సరే బయ్యర్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. మరి రిలీజ్ టైమ్ వచ్చేసరికి ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి.

అయితే ఓజి మూవీకి ఇంకా చాలా టైం ఉంది. దానికంటే ముందు ఈ ఏడాది అల్లు అర్జున్ పుష్ప-2 , రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది రాబోయే సినిమాకే ఇలా ఉంటే.. మరి ఈ ఏడాది రాబోయే మూవీస్ కు డిమాండ్ ఏ రకంగా ఉంటుందో. ఇప్పటివరకు అయితే ఈ సినిమాల గురించి ఇలాంటి టాక్ రాలేదు. మరి తర్వాత ఏమౌతుందో చూడాలి. మొత్తానికి దేవరతో అటు ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసుకునేల చేశాడు.. ఇటు ప్లాప్ దర్శకులకు హిట్స్ అందించాడు.. రాబోయే సినిమాలకు డిమాండ్ కూడా పెంచాడు. మరి ఊరికే అంటారా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని. ఒక్క దెబ్బతో మొత్తం లెక్కలే మార్చేస్తున్నాడు. దేవరతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.