Swetha
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజి విషయాలే కనిపిస్తున్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో తెలియనిది కాదు. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత.. ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నా రోజులు ఇవి. నిజానికి హీరో కంటే హీరో అభిమానులు ఇలాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజి విషయాలే కనిపిస్తున్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో తెలియనిది కాదు. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత.. ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నా రోజులు ఇవి. నిజానికి హీరో కంటే హీరో అభిమానులు ఇలాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Swetha
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజి విషయాలే కనిపిస్తున్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో తెలియనిది కాదు. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత.. ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నా రోజులు ఇవి. నిజానికి హీరో కంటే హీరో అభిమానులు ఇలాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఓ వీరాభిమాని దర్శకుడై ఓజితో ముందుకు రావడంతో. అంతా అతనిమీదే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుజీత్ సినిమాల టాక్ ఎలా ఉన్నా సరే స్టయిలిష్ ఫిలిం మేకర్ అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడను సుజీత్.
అప్పటినుంచి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా.. ఫ్యాన్స్ కు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. ఇప్పటివరకు అదొక గ్యాంగ్ స్టార్ కథ అని మాత్రమే అర్థమైంది. ట్రైలర్ వస్తే ఓ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. ఇప్పటికే ఓ రెండు మూడు డేట్స్ అనౌన్స్ చేశారు. కానీ జరగలేదు. కనీసం ఈవెంట్ లో అయినా ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అని ఎదురుచూసారు కానీ. అది అక్కవరకే పరిమితం అయింది. ఆ ట్రైలర్ ను గమనిస్తే కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ లా అనిపించింది. ఫుల్ ఆన్ ఎనర్జీ ఇచ్చింది.
అసలే ఓజి మీద ఎక్కడలేని హైప్ ఉంది. ఇప్పుడు ఈ ఈవెంట్ తో అది కాస్త విపరీతంగా పెరిగిపోయింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇదే హైప్ , ఎనర్జీ రిలీజ్ తర్వాత కూడా కొనసాగితే బావుంటుంది. మొదటి టికెట్ లక్షల్లో వేలానికి వెళ్ళింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు.. మొత్తం ఇండస్ట్రీనే ఓజి గురించి వెయిట్ చేసేలా చేసింది. ఈ ఇయర్ వచ్చిన సినిమాలలో ఇంత బజ్ దేనికి రాలేదు. సో సినిమా అట్లీస్ట్ బావుంది అని టాక్ అయినా వస్తే.. అంతా హ్యాపీ. అలా కాకుండా ఇప్పటివరకు హైప్ తో మొదలయ్యి డిజాస్టర్ టాక్ తో ఎండ్ అయిన కొన్ని సినిమాల జాబితాలో చేరిందంటే ఇక చేసేది ఏమి లేదు. ఇంకా రెండు రోజుల్లో రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.