iDreamPost
android-app
ios-app

అఫీషియల్: ప్రేమలు-2 అనౌన్స్ చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు!

Premalu 2 Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రేమలు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరూ చూశారు. అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో కూడా ఈ మూవీ ఉండబోతోందని చెప్పారు.

Premalu 2 Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రేమలు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరూ చూశారు. అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో కూడా ఈ మూవీ ఉండబోతోందని చెప్పారు.

అఫీషియల్: ప్రేమలు-2 అనౌన్స్ చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు!

2024 ఫస్ట్ ఫేజ్ లో టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో మలయాళం హవా నడిచిన విషయం తెలిసిందే. వాటిలో కూడా మరీ ముఖ్యంగా చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు మూవీ.. అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఒక్క మలయాళంలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా రాబట్టింది. అటు తెలుగులో కూడా ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీనికి తెలుగు డైలాగ్స్ 90’స్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ రాయడంతో ఆడియన్స్ మరింత నచ్చేసింది. ఈ ట్రెండ్ కి తగ్గట్లు డైలాగ్స్ ఉండటంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగులో రూ.17 కోట్ల వరకు వసూళ్లు కూడా రాబట్టింది. ఈ నేపథ్యంలో ప్రేమలుకి సీక్వెల్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

ప్రేమలు సినిమా పాన్ ఇండియా లెవల్లో అందరికీ ఫేవరెట్ చిత్రంగా మారిపోయింది. ఇందులో పెద్దగా కథ లేకపోయినా కూడా.. జెన్యూన్ కామెడీ ఉండంటో ప్రేక్షకులు ఫుల్ గా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ప్రతి సీన్ లో కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ పడ్డాయి. అలాగే ఎమోషన్, లైట్ వేలో సాగే లవ్ స్టోరీ, మంచి ఫ్రెండ్ షిప్ మొత్తం కలిపి అటు మలయాళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ హుషారులో మేకర్స్ ప్రేమలు 2 సినిమాని కూడా అనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ లాగా ఒకసారి మలయాళం తీసి ఆ తర్వాత డబ్ చేయడం కాకుండా.. ఈసారి ఒకేసారి మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని భాషల పోస్టర్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే రిలీజ్ గురించి కూడా ప్రకటించారు. 2025లో ఈ మూవీని విడుదల చేస్తామని చెప్పారు.

తెలుగుకి సంబంధించి ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు 2 గురించి పోస్ట్ చేశాడు. “నా లైఫ్ లో ప్రేమలు ఒక అందమైన ఛాప్టర్. దీనిని మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చిన తెలుగు ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను. భావనా స్టూడియోస్ వారి ధన్యవాదాలు. ప్రేమలు 2 మూవీని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నంతు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ తెలుగు వర్షన్ కి సంబంధించి ఎస్ఎస్ కార్తికేయ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అలాగే మలయాళం, తమిళ్ కి సంబంధించి అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే.. సచిన్ యూకే వెళ్లడంతో ఫస్ట్ పార్ట్ ముగిసింది. సెకండ్ పార్ట్ ని అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. కొందరు మాత్రం మళ్లీ ఫ్రెష్ గా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. మరి.. బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన మలయాళం మూవీ ప్రేమలుకి సీక్వెల్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş