Krishna Kowshik
ఇండస్ట్రీలో హీరోయిన్ల సినీ కెరీర్ చాలా తక్కువ. బాగా క్లిక్ అయితే గట్టిగా పది సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తున్న చిన్నారి.. చిన్నవయస్సులోనే నటనలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ స్టార్ నటీమణిగా దూసుకెళుతుంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల సినీ కెరీర్ చాలా తక్కువ. బాగా క్లిక్ అయితే గట్టిగా పది సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తున్న చిన్నారి.. చిన్నవయస్సులోనే నటనలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ స్టార్ నటీమణిగా దూసుకెళుతుంది.
Krishna Kowshik
చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు కొంత మంది భామలు. అయితే కెరీర్ స్టార్ చేసి దశాబ్ద కాలం అయితే ఫేడ్ ఔట్ అవుతుంటారు. కానీ స్టార్ నటిగా రెండు దశాబ్దాల పాటు రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఇదిగో ఆ కోవలోకే వస్తుంది ఈ చిన్నారి కూడా. ఇందులో నవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పాప పాన్ ఇండియన్ ఫేమస్ హీరోయిన్. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. 15 సంవత్సరాలకే హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత టాలీవుడ్ నాట అడుగుపెట్టి వరుసగా సక్సెస్ అందుకుంది. తన అందాలతో మెస్మరైజ్ చేయడమే కాకుండా.. డ్యాన్సులతో ఆకట్టుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరోలను మడతపెట్టేసింది ఈ క్యూటీ.
ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇక్కడ గ్లామరస్ అండ్ రొమాంటిక్ సీన్ల విషయంలో గిరిగీసుకున్న ఈ బ్యూటీ.. బీటౌన్ వెళ్లాక.. గీతను చెరిపేసి రెచ్చిపోయి నటిస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే మన మిల్కీ బ్యూటీ తమన్నా. 1989లో పుట్టిన తమ్ము.. 2005లో చాంద్ సా రోహన్ చెహ్రా అనే హిందీ మూవీతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. వెంటనే ఆమెకు తెలుగులో ఆఫర్ వచ్చింది. మంచు మనోజ్ హీరోగా శ్రీ అనే చిత్రంలో నటించింది. తెల్ల తోలు కనిపిస్తే చాలు.. వెంటనే అవకాశం ఇచ్చేస్తుంటుంది కోలీవుడ్. అలా అక్కడ కూడా అడుగుపెట్టింది. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్‌లో మధుగా అలరించి, ఆకట్టుకుంది. తెలుగు, తమిళంలో పేర్లర్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. తమిళ ఇలాకాలో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.
కాళిదాస్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం ఓకే అనిపించినా, 100% లవ్, బద్రినాథ్ చిత్రాలు ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి. ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమ, రెబల్, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి చిత్రాల్లో మెరిసింది. హిమ్మత్ వాలాతో మళ్లీ బీటౌన్ బాట పట్టింది ఈ సుందరి. అయితే హిందీ పరిశ్రమలో అంత గుర్తింపు రాలేదు. కానీ ఆమె బాలీవుడ్ కెరీర్‌కు బలమైన ట్రాక్ వేసింది బాహుబలి. 2015లో వచ్చిన ఈ మూవీలో అవంతిక పాత్రలో మెప్పుపొంది.. హిందీ పరిశ్రమలో బలమైన పునాదిని వేసుకుంది. తెలుగులో బెంగాల్ టైగార్, ఊపిరి, బాహుబలి 2 నుండి భోలా శంకర్ వరకు తన హవాను చూపిస్తూనే ఉంది. ఇక బాలీవుడ్ వెళ్లాక.. అక్కడ వెబ్ సిరీస్, సినిమాల్లో రెచ్చిపోయి నటిస్తున్న సంగతి వి దితమే. ఇటీవల బాక్ చిత్రంతో అలరించిన మిల్కీ రోజ్.. ప్రస్తుతం వేద, స్త్రీ 2 వంటి రెండు హిందీ చిత్రాలతో పాటు తెలుగులో ఓదెల 2 చేస్తోంది. ఇప్పటికీ అదే అందంతో మెస్మరేజ్ చేస్తుంది తమ్ము.