iDreamPost
android-app
ios-app

ఓ సాథియా మూవీ హీరోకి ప్రమాదం.. రేపు సినిమా రిలీజ్ అనగా..!

ఓ సాథియా మూవీ హీరోకి ప్రమాదం.. రేపు సినిమా రిలీజ్ అనగా..!

టాలీవుడ్ లో హీరోలకు ప్రమాదాలు జరగడం, షూటింగ్స్ లో గాయపడం ఎక్కువైపోయింది. తాజాగా టాలీవుడ్ అప్ కమింగ్ యంగ్ హీరోకి ప్రమాదం జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారు దేనిని బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. కారులో ప్రయాణిస్తున్న హీరో ఆర్యన్ గౌరాకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని సన్నిహితులు వెల్లడించారు. ఆర్యన్ బాగానే ఉన్నాడని స్పష్టం చేశారు. ప్రమాదం సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల.. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయని తెలిపారు.

ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. రేపు సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆర్యన్ గౌర ప్రమాదానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు అంతా భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఆర్యన్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రేపు థియేటర్లలో ఓ సాథియా సినిమా చూసి సూపర్ సక్సెస్ చేయాలని కోరుకున్నారు.

ఓ సాథియా సినిమా విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ లవ్ ఉంటుంది. అలాగే హీరో లైఫ్ లో కూడా కీర్తి ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? వారి మధ్య దూరం ఎందుకు పెరిగింది? వాళ్లు చివరికి కలిశారా లేదా? అనేది స్టోరీ లైన్ గా అనిపిస్తోంది. యాక్టింగ్ పరంగా ఆర్యన్ గౌరకి మంచి మార్కులే పడతాయి. ఫన్, లవ్, ఎమోషన్ అన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇరగదీశాడు. ఈ మూవీ జులై 7న థియేటర్లలో విడుదల కానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet