iDreamPost
android-app
ios-app

నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా.. ఇంత డ్రాస్టిక్ ఛేంజా..?

  • Published Aug 01, 2024 | 10:39 AM Updated Updated Aug 01, 2024 | 10:39 AM

ప్రభుదేవా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్దార్థ్, త్రిష హీరో హీరోయిన్లు. ఇక ఇందులో సిద్దార్థ్ ను తన వలలో వేసుకునేందుకు హల్వా చేసి ముప్పతిప్పలు పడే నటి గుర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

ప్రభుదేవా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్దార్థ్, త్రిష హీరో హీరోయిన్లు. ఇక ఇందులో సిద్దార్థ్ ను తన వలలో వేసుకునేందుకు హల్వా చేసి ముప్పతిప్పలు పడే నటి గుర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

  • Published Aug 01, 2024 | 10:39 AMUpdated Aug 01, 2024 | 10:39 AM
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా.. ఇంత డ్రాస్టిక్ ఛేంజా..?

హీరో కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తొలి సారిగా కెమెరా పట్టిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 2005లో సంక్రాంతి సమయంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్. సిద్దార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించగా.. శ్రీహరి, వేద, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రం నాలుగు నంది అవార్డులతో పాటు తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యాయంటే.. ఈ కథకు ఉన్న క్రేజీనెస్ అలాంటిది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు.

ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు హైలెట్. ‘చంద్రుళ్లో ఉండే కుందేలు, సంథింగ్.. సంథింగ్. సంథింగ్, నిలువద్దము నిను ఎపుడైనా, పారిపోకే పిట్ట, ఘల్ ఘల్, అధిరే అధిరే.. కన్నే అధిరే’ సాంగ్స్ ఆల్ టైమ్ హిట్. ప్రతి పాట వీనుల విందుగా, శ్రావ్యంగా తోస్తుంది ఇప్పటికీ. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించిన అమ్మాయి గుర్తుందా..? సంతోష్ అంటూ హీరో సిద్దార్థ్ ను ప్రేమిస్తుంది ఓ అమ్మాయి. డాలీ పాత్రలో చాలా మోడ్రన్‌గా ఆకట్టుకుంది. ఇందులో హీరో సిద్దు కోసం హల్వా చేసి మెప్పించాలనుకుంటుంది. కానీ అది బెడిసి కొడుతుంది. త్రిషతో క్లోజ్‌గా ఉంటున్నాడని గుర్రపు బొమ్మను కూడా పగులకొట్టేస్తుంది.

ఉండేది కాసేపే అయినా డాలి పాత్రలో ఆకర్షించిన  ఆ నటి ఎవరో తెలుసా.. ఆమె పేరు నందిత జెన్నీఫర్. కోలీవుడ్ నటి,  ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నా కూతురు ఈమె. ఆమె తొలుత స్పెషల్ సాంగ్స్‌లో నటించేది. జెన్నీఫర్ కూడా కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు నటి కూడా. స్పెషల్ అపీరియన్స్ సాంగ్స్ నుండి సెకండ్ హీరోయిన్ ఆ తర్వాత లీడ్ యాక్టర్‌గా పలు సినిమాల్లో నటించింది. ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపించేది. తెలుగులో కూడా ఆమె హీరోయిన్‌గా చేసింది. 2004లో శ్రీహరి హీరోగా వచ్చిన సింహాద్రి నాయుడులో ఆమెనే హీరోయిన్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో హీరోకు అమితంగా ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది.

తమిళంలో హీరోయిన్‌గా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ చేసేది. తెలుగులో శ్రియా మెయిన్ రోల్ చేసని పవిత్రలో ఐటెం సాంగ్ తో అలరించిన ఈ బ్యూటీ.. కేవలం ఈ పాటలకే పరిమితం అయ్యింది. వేర్ ఈజ్ ది విద్యాబాలన్, నా రూటే సెపరేట్ వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. 2007లో కాశీ విశ్వనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం తమిళ బుల్లితెరపై నటిస్తోంది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో నటిస్తుంది. అప్పుడు గ్లామరస్ షోతో కట్టిపడేసన ఈ బ్యూటీ..ఇప్పుడు అచ్చమైన శారీలో మరింత అందంగా కనిపిస్తుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom