iDreamPost
android-app
ios-app

NTR అభిమాని చివరి కోరిక.. దేవర సినిమా చూసే వరకు బతికించండి అంటూ!

  • Published Sep 12, 2024 | 10:00 AM Updated Updated Sep 12, 2024 | 12:43 PM

Devara Movie: తమ అభిమాన హీరోలు అంటే ఫ్యాన్స్ ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ యన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం.. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ అభిమాని తన చివరి కోరిక ఎంటో వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకుంటారు.

Devara Movie: తమ అభిమాన హీరోలు అంటే ఫ్యాన్స్ ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ యన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం.. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ అభిమాని తన చివరి కోరిక ఎంటో వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకుంటారు.

  • Published Sep 12, 2024 | 10:00 AMUpdated Sep 12, 2024 | 12:43 PM
NTR అభిమాని చివరి కోరిక.. దేవర సినిమా చూసే వరకు బతికించండి అంటూ!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ యన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరెక్కుతున్న ‘దేవర’ ఈ నేల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ స్పీడ్ అందుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే థియేటర్లో పూనకాలే అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే ఓ క్యాన్సర్ పేషెంట్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో కన్నీరు తెప్పించేలా ఉంది.. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో యన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. తెలుగు తెరపై తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న జూనియర్ యన్టీఆర్ అంటే అభిమానులు ప్రాణం ఇస్తారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా యన్టీఆర్ కి అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. ఇక తన అభిమానుల అన్నా ఎన్టీఆర్ కి వల్లమాలిన అభిమానం. 19 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాడుతున్న ఓ యువకుడు యన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ చూసి చనిపోతా అంటూ చివరి కోరిక కోరడు. కౌశిక్ (19) అనే యువకుడికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.యన్టీఆర్ నటిస్తునన సినిమా ‘దేవర’ రిలీజ్ ఈ నెల 27న ఉంది..అప్పటి వరకు తనను ఎలాగైనా బ్రతికించండి అంటూ వైద్యులను కౌశిక్ దీనంగా కోరడం అందరి హృదయాలను కలచివేసింది.

టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్. 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.  సరస్వతి మాట్లాడుతూ.. ‘కౌశిక్ కి చిన్నప్పటి నుంచి యన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయన నటించిన సినిమా రిలీజ్ అంటే చాలు పండుగ చేసుకునేవాడు.కౌశిక్ రెండు సంవత్సరాలుగా బ్లెడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు..అతని చికిత్సకోసం ఇప్పటి వరకు రూ.60 లక్షల వరకు అవుతుంది. రోజు రోజుకీ మృత్యువు దగ్గరవుతుంది. కౌశిక్.. యన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా ఈనెల 27న రిలీజ్ కాబోతుంది.. అప్పటి వరకు తనను బతికించమని డాక్టర్లను ప్రాదేయపడుతుండటం చూస్తుంటే ప్రాణం పోతుంది’ అని కన్నీరు పెట్టుకుంది. దయచేసి దాతలు సహాయం చేసి నా కొడుకునే బ్రతికించాలని విజ్ఞప్తి చేసింది కౌశిక్ తల్లి. గతంలో యన్టీఆర్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానుల వద్దకు స్వయంగా వెళ్లి పలకరించి ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş