iDreamPost
android-app
ios-app

NTR బామ్మర్ది చేసుకునే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇదే..!

  • Published Nov 04, 2024 | 5:29 PM Updated Updated Nov 04, 2024 | 5:29 PM

Nithin narne wife details: నితిన్ నార్నె.. ఈ కుర్ర హీరో ఇప్పుడు అందరికి బాగానే పరిచయం అయ్యాడు. తీసింది కొన్ని సినిమాలే అయినా కానీ.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ హీరో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇప్పుడు ఎన్టీఆర్ వెంకటేష్ బంధువులుగా మారిపోయారు. ఆ కథేంటో చూసేద్దాం.

Nithin narne wife details: నితిన్ నార్నె.. ఈ కుర్ర హీరో ఇప్పుడు అందరికి బాగానే పరిచయం అయ్యాడు. తీసింది కొన్ని సినిమాలే అయినా కానీ.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ హీరో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇప్పుడు ఎన్టీఆర్ వెంకటేష్ బంధువులుగా మారిపోయారు. ఆ కథేంటో చూసేద్దాం.

  • Published Nov 04, 2024 | 5:29 PMUpdated Nov 04, 2024 | 5:29 PM
NTR బామ్మర్ది చేసుకునే   అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇదే..!

ఎక్కడైనా సరే ఓ పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. అదే పెళ్లి సినీ ఇండస్ట్రీ వారిదైతే.. ఇక మ్యూచ్యువల్ ఫ్యాన్స్ కు పండగే. తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ కూడా ఇలాంటి కలయికకు దారి తీసింది. ఈ కుర్ర హీరో పెళ్లితో ఇద్దరు అగ్రహీరోలు బంధువులుగా మారబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నె ఎంగేజ్మెంట్ పిక్స్ , ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫంక్షన్ కు చాలా మంది అతిధులు వచ్చారు. వారిలో వెంకటేష్ అందరికి స్పెషల్ యాట్రక్షన్ గా నిలిచాడు. నార్మల్ గానే సెలెబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతుంటే.. ఆ దంపతులు ఎవరు ఏంటి అనే ఆరాలు తీస్తారు నెటిజన్లు. మరి ఇక్కడ జరిగేది ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అందులోను వెంకీ మామ సందడి. దీనితో అందరికి ఒకింత ఎక్కువ సందేహాలే మొదలయ్యాయి. నితిన్ నార్నె చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఆమెకు వెంకటేష్ కు ఉన్న సంబంధం ఏంటి ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

నితిన్ నార్నె పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు శివాని. ఆమె వెంకటేష్ కు బంధువులు అయినా.. తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూప దంపతుల కూతురు. అంటే వెంకటేష్ కజిన్ కూతురు. అంటే అటు ఎన్టీఆర్ కు ఆమె చెల్లెలు వరుస అవుతుంది. ఇలా ఎన్టీఆర్ కు వెంకటేష్ బాబాయ్ వరుస అయ్యాడు. దీనితో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్..సడెన్ గా  ఫ్యామిలీ తో సహా బామ్మర్ది ఫంక్షన్ లో కనిపించడంతో.. అందరూ షాక్ అయ్యారు. ఇవి వార్ 2 లుక్స్ అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లుక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక అటు అమ్మాయి తరపు నుంచి వెంకి మామ ఫ్యామిలీ వచ్చి ఆ జోష్ ను ఇంకాస్త పెంచారు. వీరితో పాటు పలువురు ముఖ్య అతిధులు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. వెంకటేష్ ఎన్టీఆర్ పిల్లలతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

ఇక నితిన్ నార్నె విషయానికొస్తే.. కేవలం రెండు సినిమాలతోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాడు. దీనితో తర్వాత ఈ హీరో నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయా అని అందరిలో ఓ చిన్న క్యూరియాసిటీ మొదలైంది. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి . శ్రీశ్రీశ్రీ రాజావారు, మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మూవీ సూపర్ హిట్ అందుకోవడంతో.. సెకండ్ పార్ట్ పై డీసెంట్ హైప్ ఉంది. ఇక శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీ ఈ దసరాకు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. ఇక నితిన్ – శివాని పెళ్లి విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈసారి పెళ్లిలో బాబాయ్ అబ్బాయి కలిసి ఎలా సందడి చేస్తారో చూడాలి. మరి ఎన్టీఆర్ వెంకటేష్ కొత్త బంధుత్వంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss