iDreamPost
android-app
ios-app

టెంపరేచర్ పెంచుతున్న టెంపర్ బ్యూటీ! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Published - 02:24 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 02:24 PM, Fri - 21 July 23
టెంపరేచర్ పెంచుతున్న టెంపర్ బ్యూటీ! వైరల్ అవుతున్న వీడియో!

నోరా ఫతేహి.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టెంపర్ సినిమాలో.. ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ ఆడిపాడిన నోరా.. ఆ తర్వాత బాహుబలిలో మనోహరి సాంగ్ తో అందరి మతులు పోగొట్టింది. ఒక్కసారిగా నోరా అందాలకు గ్లామర్ ప్రియులు అందరూ ఫిదా అయిపోయారు. అదే ఫ్లోలో తెలుగులో చాలా ఐటమ్ సాంగ్స్ చేసేసింది అమ్మడు. టెంపర్, బాహుబలి తర్వాత కిక్ 2, ఊపిరి ఇలా చాలా సినిమాలలో మెరిసింది. కానీ.. ఒకసారి ఐటమ్ బ్యూటీగా ఎంట్రీ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా! నోరా విషయంలో కూడా అదే జరిగింది. తెలుగు నుండి తమిళంకు, అక్కడినుండి బాలీవుడ్ కి వెళ్లినా.. ఐటమ్ సాంగ్స్ తప్పలేదు.

ఎట్టకేలకు ఐటమ్ బ్యూటీగా సాంగ్స్ తగ్గించేసి.. నటిగా, మోడల్ గా రాణిస్తోంది ఈ ఇండో కెనడియన్ బ్యూటీ. సోషల్ మీడియాలో జనాలను ఎలా అట్రాక్ట్ చేయాలో నోరాకి వెన్నతో పెట్టిన పని. అందుకే చూసేవాళ్ళుఎం ఒంట్లో సెగలు రేగేలా టాప్ టు బాటమ్ తన అందాలను ఎరగా వేస్తూ.. ఫోటోలు, వీడియోలు పెడుతుంటుంది నోరా. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ.. మిలియన్స్ కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదిగాక బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది అమ్మడు. ఏ ఈవెంట్ జరిగినా అక్కడికి చూసేవాళ్ళ కళ్ళు చెదిరిపోయేలా అవుట్ ఫిట్స్ ధరించి రచ్చ లేపుతోంది. అందాలన్నీ ఆరబోస్తూ వస్తే.. అందరి చూపు ఆమె వైపే.

కొంతమంది హాట్ బ్యూటీలు ఎక్కడికి వెళ్లినా అందరి కళ్ళు తమపైనే ఉండాలని తెగ తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారిలో నోరా కూడా ఉంటుంది. ఎందుకంటే.. తన బ్యూటీ ఇంటెన్షన్ కోసం చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకుంటుంది. ఒక్కోసారి అలాంటి డ్రెస్ ల వలన కాంట్రవర్సీలు కూడా తప్పవు అనుకోండి. కానీ.. ఒక్కసారి అలవాటు పడిపోయాక సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. నోరా కూడా అంతే. రీసెంట్ గా అమ్మడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఈవెంట్ కి వెళ్ళింది. అక్కడికి నోరా ఎంటర్ అయిన అవుట్ ఫిట్ చూస్తే.. ఎవరైనా కళ్ళప్పగించి చూడాల్సిందే. చూడటానికి సారీలా అనిపిస్తున్నా.. పైటను పక్కకు జరిపి షో చేసింది నోరా. ఇంకేముంది అమ్మడికి ఫోటోక్లిక్స్.. కుర్రాళ్ళకు కునుకు లాస్ట్. ప్రెజెంట్ నోరా లేటెస్ట్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి నోరా గ్లామర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

marsbahis girişjojobet