iDreamPost
android-app
ios-app

Heroine: స్టార్ హీరోయిన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్ట్ తప్పదా?

  • Published Feb 09, 2024 | 5:26 PM Updated Updated Feb 09, 2024 | 5:26 PM

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ అనుకోని రీతిలో కొన్ని చిక్కుల్లో పడింది. దీంతో ఈ అమ్మడుకు కోర్టు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇంతకి ఈమె ఎవరంటే..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ అనుకోని రీతిలో కొన్ని చిక్కుల్లో పడింది. దీంతో ఈ అమ్మడుకు కోర్టు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇంతకి ఈమె ఎవరంటే..

  • Published Feb 09, 2024 | 5:26 PMUpdated Feb 09, 2024 | 5:26 PM
Heroine: స్టార్ హీరోయిన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్ట్ తప్పదా?

సినీ ప్రపంచం పై ఆసక్తితో తరుచు ఎంతోమంది తారలు అడుగుపెడుతుంటారు. ఈ క్రమంలోనే.. కొంతమంది అనుకొని రీతిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని సార్లు అనేక వేధింపులు కూడా ఎదురవుతాయి. ఇక్కడ ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోతే మోసం చేశావాళ్లే ఎక్కువ. ఇలా అవకాశాల పేరిట చాలామంది వాడుకున్న దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఈ రంగంలో నిలబడినవారు చాలా తక్కువగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోయిన్ లు సైతం అనుకొకుండా కొన్ని చిక్కుల్లో పడుతూంటారు. ఈ నేపథ్యంలోనే.. కొందరు ఏకంగా అరెస్ట్ అవ్వడం, కోర్టు మెట్లక్కిన వారు కూడా ఉన్నారు. మరి కోవకు చెందిన వారిలో ఈ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఒకరు. ఈమె ఒక స్టార్ హీరోయిన్. తాను నటించిన సినిమాలన్నీ మంచి హిట్ అందడంతో అమ్మడు క్రేజ్ బాగా పేరిగిపోయింది. కానీ, ఈమె అనుకోని రీతిలో కొన్ని చిక్కుల్లో పడింది. దీంతో ఆమెకు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇంతకి ఈ బ్యూటీ ఎవరంటే..

బాలీవుడ్ లో ‘దబాంగ్’ సినిమాతో 2010లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందలా బామ. దీని తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే అనుకోని రీతిలో ఈ బ్యూటీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లోనే పడింది ఇంతకి ఆమె ఎవరో కాదు.. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘సోనాక్షి సిన్హా’. ఈ అమ్మడు అనుకోకుండా.. ఓ చీటింగ్ కేసులో ఇరుక్కుంది. దీంతో ఈమె పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతే కాకుండా అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 2018లో, నటి సోనాక్షి సిన్హా టీమ్.. మాళవిక పంజాబీ, ధుమిల్ థక్కర్, ఎడ్గార్ సకారియా, అభిషేక్ సిన్హా ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ నుంచి డబ్బులు అందుకున్నారు. కాగా, సెప్టెంబర్ 30, 2018న జరిగిన ఈవెంట్‌కు సోనాక్షి హాజరు కావాల్సి ఉండగా.. ఆమె ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో ఈవెంట్ నిర్వాహకులకు భారీ నష్టం జరిగింది. అయితే సోనాక్షి సిన్హాకు ఈవెంట్ కోసం ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే.. ఆ ఈవెంట్ నిర్వాహకులు సోనాక్షి సిన్హా అండ్ టీమ్‌పై ఫిబ్రవరి 2019లో మురాదాబాద్ కోర్టులో చీటింగ్ కేసు వేశారు.

అయితే ఈ కేసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన సోనాక్షి సిన్హా పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ కేసులో తనపై జరుగుతున్న ఆపరేషన్, విచారణపై స్టే విధించారు. కానీ, ఆమె టీమ్ పై విచారణ జరుగుతోంది. కాగా, ఇప్పుడు సోనాక్షి టీమ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ చేయబడింది. ఇక ఈ కేసురు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా చోటే మియా’ , ని’ఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ చిత్రాలతో బిజీగా ఉంది. దీనితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. ఇక గతంలోఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. మరి, నటి సోనాక్షి సిన్హా పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ విధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibomcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/