iDreamPost
android-app
ios-app

Nivin Pauly: లైంగిక ఆరోపణలు.. ప్రేమమ్ హీరోపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు!

  • Published Sep 03, 2024 | 10:12 PM Updated Updated Sep 04, 2024 | 11:44 AM

Nivin Pauly, Non-bailable Case: ప్రేమమ్ హీరో నివిన్ పౌలీపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిపై కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే..

Nivin Pauly, Non-bailable Case: ప్రేమమ్ హీరో నివిన్ పౌలీపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిపై కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 03, 2024 | 10:12 PMUpdated Sep 04, 2024 | 11:44 AM
Nivin Pauly: లైంగిక ఆరోపణలు.. ప్రేమమ్ హీరోపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు!

మలయాళ చిత్ర పరిశ్రమంలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటి ఇచ్చిన నివేదిక ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదిక బయటకి వచ్చిన తర్వాత చాలా మంది పరిశ్రమకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న సమస్యలను వెల్లడిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో హీరోయిన్స్ కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఓ నటి ప్రేమమ్ హీరో నివిన్ పౌలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశం ఇస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది.

నివిన్ పౌలీ.. మలయాళ ఇండస్ట్రీతో పాటుగా ఇతర పరిశ్రమలకు కూడా సుపరిచితుడే. ‘ప్రేమమ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ నటి ఇతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తనకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి గత నవంబర్ లో  దుబాయ్  అక్కడే తనపై లైంగిక వేధింపులు జరిపినట్లు సదరు నటి ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. దాంతో విచారణ ప్రారంభించిన పోలీసులు హీరో నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వీరిలో ఓ నిర్మాత కూడా ఉన్నాడు.

Premam Hero

ఇక ఈ కేసులో ఆరో నిందితుడిగా నివిన్ పౌలీ పేరును చేర్చారు పోలీసులు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఇప్పటికే లైంగిక ఆరోపణలలో నటులు సిద్ధిఖీ, జయసూర్య, డైరెక్టర్ రంజిత్ పై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ విషయంలో కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ప్రేమమ్ హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss