iDreamPost
android-app
ios-app

యు.ఎస్ కు బయల్దేరిన తారక్.. తెలుగులో ఇక దేవర ఈవెంట్స్ లేనట్లేనా!

  • Published Sep 23, 2024 | 11:36 AM Updated Updated Sep 23, 2024 | 12:15 PM

No Events For Devara Movie: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా సంగతి తెలిసిందే. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఇటు అభిమానులతో పాటు.. అటు చిత్ర బృందం కూడా చింతిస్తున్నట్లు తెలిసిన సంగతే. మరి దేవర ఈవెంట్ అసలు ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

No Events For Devara Movie: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా సంగతి తెలిసిందే. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఇటు అభిమానులతో పాటు.. అటు చిత్ర బృందం కూడా చింతిస్తున్నట్లు తెలిసిన సంగతే. మరి దేవర ఈవెంట్ అసలు ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

  • Published Sep 23, 2024 | 11:36 AMUpdated Sep 23, 2024 | 12:15 PM
యు.ఎస్ కు బయల్దేరిన తారక్.. తెలుగులో ఇక దేవర ఈవెంట్స్ లేనట్లేనా!

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో ట్ వస్తున్న దేవర చిత్రం రిలీజ్ కు.. ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. తారక్ ను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఎంత ఆరాట పడుతున్నారో తెలియనిది కాదు. కేవలం సినిమా కోసమే అంత బజ్ ఉంటే.. ఇక ప్రేక్షకులలో తారక్ ను నేరుగా చూడాలనే కోరిక ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇలా అభిమానుల తాకిడి ఎక్కువ అవ్వడంతోనే.. తాజాగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయింది. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు అభిమానులతో పాటు.. చిత్ర బృందం కూడా చింతిస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా అటు విదేశాల్లో కూడా తారక్ కు ఉన్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. దీనితో రీసెంట్ గా వచ్చిన సమాచారం ప్రకారం తారక్ యూ.ఎస్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఇక తెలుగులో దేవరకు ఎలాంటి ఈవెంట్స్ లేనట్లేనా.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజమే ఇలాంటి సందేహాలు రావడంలో తప్పు లేదు. ఎందుకంటే, దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా.. తెలుగులో ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో జరిగింది. ప్రెస్ మీట్ తమిళనాడు లో జరిగింది. సరే ఎలాగూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ఉంటుంది కదా అనుకుంటే.. ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో.. ఈవెంట్ నిర్వహించలేక క్యాన్సిల్ చేశారు. ఇక ఇప్పుడు చూస్తే తారక్ అమెరికా బయలుదేరినట్లు సమాచారం. అక్కడ జరిగే బియాండ్ ఫెస్ట్ , హాలీవుడ్ ప్రీమియర్ కు అటెండ్ అయ్యి.. అక్కడ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని.. 27న తిరిగి రానున్నాడు. సో ఈ లెక్కన చూస్తే.. అభిమానులు అనుమానమే నిజం.. ఇక తెలుగులో దేవరకు సంబంధించిన ఈవెంట్స్ లేనట్లే. కంత్రి సినిమా తర్వాత.. ఏ ఈవెంట్ లేకుండా వస్తున్న తారక్ సినిమా ఇదే. ఈవెంట్ లేకపోయినా కూడా… ఫ్యాన్స్ మాత్రం దేవర సినిమాను హిట్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక తారక్ మాస్ యాక్షన్ కు , డ్యాన్స్ కు సెప్టెంబర్ 27న థియేటర్స్ లో మాస్ జాతర చేసేలా ఉన్నారు అభిమానులు. ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా సెకండ్ ట్రైలర్ కు అయితే.. అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. చెప్పిన సమయానికి కొన్ని అప్డేట్స్ రాకపోయినా.. జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయినా.. ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారే తప్ప.. దేవర మూవీ మీద క్రియేట్ అయినా హైప్ ను మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. మరి రిలీజ్ తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş