iDreamPost
android-app
ios-app

ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొట్టిన యంగ్‌ హీరోయిన్‌!

  • Published Jul 26, 2023 | 3:49 PM Updated Updated Jul 26, 2023 | 3:49 PM
  • Published Jul 26, 2023 | 3:49 PMUpdated Jul 26, 2023 | 3:49 PM
ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొట్టిన యంగ్‌ హీరోయిన్‌!

దేవుళ్లు సినిమా చూసిన వారికి ఆ సినిమాలో నటించిన బాల నటి ‘నిత్యా శెట్టి’ గుర్తుండే ఉంటుంది. దేవుళ్లు సినిమాతో  పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మాయి ప్రస్తుతం హీరోయిన్‌గా అదరగొడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. పిట్టకథ సినిమాలో నటనతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో నువ్వు తోపురా, పడేశావే, వాంటెడ్‌ పండుగాడు సినిమాల్లో నటించింది. తమిళంలో ఐరావతం, కాదల్‌, అలగన్‌ వంటి సినిమాలో​ నటించారు. తెలుగు, తమిళంలో ఆమె నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం షూటింగులు జరుపుకుంటున్నాయి.

నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే నిత్యా శెట్టి.. ఖాళీ సమయం దొరికితే ఫ్రెం‍డ్స్‌, ఫ్యామిలీతో గడుపుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఫొటోలతో పాటు ఓ ఎమోషనల్‌ పోస్టు కూడా పెట్టారు. ‘‘ జనం వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. కానీ, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు. మనకు రేటింగ్‌ ఇవ్వాల్సి వస్తే.. 10కి 11 ఇస్తాను.

నీతో ఎన్నో మరుపురాని క్షణాలను మూటగట్టుకున్నాను’’ అంటూ రాసుకొచ్చారు. ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. వైరల్‌గా మారిన ఓ ఫొటో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఫొటోలో నిత్యా తన ఫ్రెండ్‌తో కలిసి షాట్స్‌(ఆల్కహాల్‌)తాగుతూ ఉంది. స్నేహితురాలి బర్త్‌డే సందర్భంగా ఆమె షాట్స్‌ తాగింది. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ప్రెండ్‌తో కలిసి యంగ్‌ హీరోయిన్‌ నిత్యా శెట్టి షాట్స్‌ తాగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş