iDreamPost
android-app
ios-app

నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ హీరో నన్ను లైంగికంగా చాలా వేధించాడు’

  • Published Jun 15, 2023 | 11:41 AM Updated Updated Jun 15, 2023 | 11:41 AM
  • Published Jun 15, 2023 | 11:41 AMUpdated Jun 15, 2023 | 11:41 AM
నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ హీరో నన్ను లైంగికంగా చాలా వేధించాడు’

సమాజంలో ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, వేధింపులు, సర్వసాధారణం అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండ.. ఆడ వాళ్ళు అయితే చాలు అన్నట్లు రాక్షసంగా ప్రవర్తిస్తారు కొందరు మృగాళ్లు. నేడు సమాజంలో ప్రతి చోట ఆడవారి మీద వేధింపులు నిత్య కృత్యం అయ్యాయి. మిగతా రంగాలతో పోలీస్తే.. సినిమా రంగంలో ఈ వేధింపులు మరి కాస్త ఎక్కువ. గతంలో ఇలాంటి వాటి గురించి వెల్లడించడానికి భయపడే వారు. కానీ మీటూ ఉద్యమం తర్వాత చాలామంది సెలబ్రిటీస్ తమ జీవితంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు.

ఈ వేధింపుల బాధితుల్లో స్టార్ హీరోయిన్ లు కూడా ఉండడం సంచలనంగా మారుతుంది. ఇండస్ట్రీలో తనకు ఎదురైనా వేధింపుల గురించి వెల్లడించారు. ఇప్పటికే చాలా స్టార్స్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి జాబితాలో నిత్యా మీనన్ కూడా చేరడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా నిత్యామీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ సందర్బంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ.. “కామాంధులు అన్నిరంగాల్లోనూ ఉన్నారు. నేను టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు. అసభ్యంగా తాకుతూ పిచ్చిగా ప్రవర్తించాడు” అని తెలిపింది. నిత్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై కూడా స్పందించింది ఈ అమ్ముడు.

హీరో నాని నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నిత్యా మీనన్. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకా.. నిత్యా మీనన్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది. ప్రస్తుతం తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్య. అలానే ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జ్ గా వ్యవహరించింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis