iDreamPost
android-app
ios-app

నిత్యా మీనన్‌ ఇంట తీవ్ర విషాదం.. ఓ శకం ముగిసిందంటూ భావోద్వేగం!

  • Published Jul 16, 2023 | 11:41 AM Updated Updated Jul 16, 2023 | 11:41 AM
  • Published Jul 16, 2023 | 11:41 AMUpdated Jul 16, 2023 | 11:41 AM
నిత్యా మీనన్‌ ఇంట తీవ్ర విషాదం.. ఓ శకం ముగిసిందంటూ భావోద్వేగం!

అందం, నటన మాత్రమే కాక సింగింగ్ వంటి టాలెంట్‌తో బహుముఖ ప్రజ్ఞాశీలిగా పేరు తెచ్చుకుంది హీరోయిన్‌ నిత్యా మీనన్‌. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం నిత్యా మీనన్‌.. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ.. కెరీర్‌లో ముందుకు సాగుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాక వెబ్‌ సిరీస్‌లు, సింగింగ్‌ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ.. ఓటీటీలు, సిల్వర్‌ స్క్రీన్‌ మీద సందడి చేస్తోంది నిత్యా మీనన్‌. ప్రస్తుతం సెలబ్రిటీల్లో చాలా మంది సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించినా లేకపోయినా.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కానీ నిత్యా మీనన్‌ మాత్రం సోషల్‌ మీడియాకు చాలా దూరం. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే సోషల్‌ మీడియాను వాడుతుంటుంది. ఇక తాజాగా నిత్యా మీనన్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

నిత్యా మీనన్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె అమ్మమ్మ మరణించింది. ఈ విషయాన్ని నిత్యా మీనన్‌ స్వయంగా వెల్లడించింది. ఒక శకం ముగిసింది.. నిన్ను ఎప్పటికి మిస్‌ అవుతునే ఉంటాను అమ్మమ్మ.. గుడ్‌బై. మై చెర్రీమ్యాన్‌(తాతయ్య)ను బాగా చూసుకుంటాను అంటూ అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫొటోని షేర్‌ చేస్తూ నిత్యా మీనన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. అయితే తన అమ్మమ్మ మృతికి గల కారణాలు వెల్లడించలేదు. ఈ విషయం తెలిసి నిత్యా మీనన్‌ అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

నిత్యా మీనన్‌ ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన భీమ్లా నాయక్‌ సినిమా.. నిత్య మీనన్‌ నటించిన చివరి తెలుగు చిత్రం. ఇక ఆమె చివరగా ధనుష్‌తో కలిసి చేసిన తిరు సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. కోలీవుడ్‌లో అయితే వంద కోట్లు రాబట్టింది. ప్రస్తుతం నిత్యా మీనన్ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నట్టు సమాచారం. తన అమ్మమ్మ మరణంతో నిత్యా మీనన్ శోకసంద్రంలో మునిగిపోయింది. మరి కొన్ని రోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş