iDreamPost
android-app
ios-app

కార్తీక దీపం 2పై డాక్టర్‌ బాబు క్లారిటీ.. వంటలక్కతో కలిసి!

  • Published Jun 26, 2023 | 4:53 PM Updated Updated Jun 26, 2023 | 4:53 PM
  • Published Jun 26, 2023 | 4:53 PMUpdated Jun 26, 2023 | 4:53 PM
కార్తీక దీపం 2పై డాక్టర్‌ బాబు క్లారిటీ.. వంటలక్కతో కలిసి!

ఎన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు వచ్చినా సరే.. ఓ సూపర్‌హిట్‌ సీరియల్‌ క్రేజ్‌తో పోటి పడలేవు. సినిమా మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కానీ సీరియల్‌ మాత్రం.. ఏళ్ల తరబడి కొనసాగుతుంటుంది.. కనుక ప్రేక్షకులు సీరియల్స్‌తో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇలా బుల్లితెర మీద.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సీరియల్స్‌ జాబితాలో.. ముందు వరుసలో ఉంటుంది.. స్టార్‌మాలో ప్రసారం అయిన కార్తీకదీపం సీరియల్‌. ఏళ్ల​ పాటు ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్‌.. కొన్ని నెలల క్రితం ముగిసింది. అయితే సీరియల్‌ ముగింపు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దాంతో త్వరలోనే కార్తీకదీపం పార్ట్‌-2 ఉంటుంది అనే ప్రచారం సాగింది.

గత కొన్ని రోజులుగా కార్తీకదీపం 2 త్వరలోనే ఉంటుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అందుకు కారణం.. ఈ వారం స్టార్‌ మాలో ప్రసారం అయిన మా బోనాల జాతర ప్రత్యేక కార్యక్రమం. కార్తీకదీపం నటీనటులు.. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిరుపమ్‌ పరిటాల అలియాస్‌ డాక్టర్‌ బాబు, ప్రేమి విశ్వనాథ్‌.. అలియాస్‌ వంటలక్క, శోభా శెట్టి అలియాస్‌ మోనిత.. మరోసారి తెర మీద సందడి చేశారు. దాంతో ప్రేక్షకులు తర్వలోనే కార్తీకదీపం సీరియల్‌ 2 ప్రారంభం అవుతుందని భావించారు. అయితే దానిపై డాక్టర్‌ బాబు అలియాస్‌ నిరుప‌మ్ క్లారిటీ ఇచ్చారు. త‌న అనాల‌సిస్ ప్ర‌కారం.. మంచి క‌థ కుదిరితే త‌ప్ప కార్తీక‌దీపం 2 వ‌చ్చే అవ‌కాశం లేదనే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిరుపమ్‌ పరిటాల మాట్లాడుతూ.. ‘‘నా విశ్లేష‌ణ ప్ర‌కారం.. ప్ర‌తి ఒక్క‌రి కుటుంబంలో గొడ‌వ‌లుంటాయి. అందుక‌నే కార్తీక‌దీపం సీరియ‌ల్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. అందుక‌నే సీరియ‌ల్ అయిపోయి చాలా నెలలు అవుతున్నా సరే.. ఇప్పటికి నేను బ‌య‌ట క‌న‌ప‌డితే వంట‌ల‌క్క గురించే అడుగుతుంటారు. నా భార్య మంజుతో పాటు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కూడా వంట‌ల‌క్క ఎక్క‌డ‌? అని అంటారు. అయితే ఆమెకు పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే కార్తీక దీపం 2 ఉంటుందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు నిరుప‌మ్ స్పందించారు. ‘‘నాకు తెలిసి కార్తీకదీపం 2’ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ క‌థ దొర‌కాలి.అన్నీ కుదిరితేనే సీజ‌న్ 2 చేయాలి. లేక‌పోతే ట‌చ్ చేయ‌పోతేనే బెట‌రేమో. అయితే డాక్టర్‌ బాబు-వంటలక్క కాంబోలో మ‌రో సీరియ‌ల్ చేయొచ్చు’’ అన్నారు. దాంతో కార్తీక దీపం పార్ట్‌ 2 ఉండదని అర్థం అయ్యింది. ఈ వార్త తెలిసి వంటలక్క అభిమానులు బాధపడుతున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbet