Swayambhu: నిఖిల్ నుంచి ఇది ఊహించలేదు! స్వయంభూ 3, 4 పార్టులా?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ 'స్వయంభూ'. సంయుక్త మీనన్, నభా నటేష్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న ప్రేక్షకులు నిఖిల్ నుంచి ఇది ఊహించలేదు అంటున్నారు.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ 'స్వయంభూ'. సంయుక్త మీనన్, నభా నటేష్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న ప్రేక్షకులు నిఖిల్ నుంచి ఇది ఊహించలేదు అంటున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. ఓ మూవీని రెండు, మూడు పార్ట్ లుగా తెరకెక్కించడం ప్రస్తుతం పరిశ్రమలో  నడుస్తున్న సంప్రదాయం. బాహుబలి నుంచి ఇది మెుదలైందని చెప్పాలి. కానీ ఇప్పుడు మేకర్స్ మరో అడుగు ముందుకేస్తూ.. పార్ట్ 3, 4ల వరకు వెళ్తున్నారు. పుష్ప, ఇండియన్ 2 చిత్రాలతో ఈ ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది. ఈ లిస్ట్ లోకి మరో మూవీ కూడా చేరినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘స్వయంభూ’. సంయుక్త మీనన్, నభా నటేష్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ విన్న ప్రేక్షకులు నిఖిల్ నుంచి ఇది ఊహించలేదు అంటున్నారు.

‘స్వయంభూ’.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త మీనన్, నభా నటేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ మూవీ. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది నభా నటేష్. డార్లింగ్ మూవీ ప్రమోషన్లో భాగంగా నభా నటేష్ మాట్లాడుతూ.. స్వయంభూ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ కథను డైరెక్టర్ ఆమెకు చెప్పేటప్పుడే ఇది మూడు, నాలుగు భాగాలుగా తెరకెక్కే కథ అని, అయితే ఇప్పుడు రెండు భాగాలు మాత్రం తీస్తామని చెప్పాడట. దాంతో భవిష్యత్ లో స్వయంభూకు సీక్వెల్స్ రావడం పక్కా అని తెలుస్తోంది. ద

కాగా.. నిఖిల్ నుంచి ఇది అస్సలు ఊహించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా.. నిఖిల్ గత కొంత కాలంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాడు. అదే జోరులో స్వయంభూ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించి.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాడు. అయితే పార్ట్ 2 వరకు ఓకే గానీ.. 3, 4 భాగాలు అంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు అభిమానులు. పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా కావడంతో భారీగా ఖర్చు చేస్తున్నారు. పెద్ద పెద్ద సెట్స్ వేసి, ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మేకర్స్. అయితే పార్ట్ 1 విజయం మీదే మిగతా భాగాలు తెరకెక్కించాలా? వద్దా? అన్నది ఆధారపడి ఉంటుందన్ని ప్రత్యేకంగా చెప్పక్కరేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments