iDreamPost
android-app
ios-app

తండ్రైన హీరో నిఖిల్.. ఫోటో వైరల్

  • Published Feb 21, 2024 | 2:40 PM Updated Updated Feb 21, 2024 | 2:40 PM

Hero Nikhil Blessed with Baby Boy: హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరో నిఖిల్ ఇంట సంతోషాలు వెల్లువిరిశాయి.

Hero Nikhil Blessed with Baby Boy: హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరో నిఖిల్ ఇంట సంతోషాలు వెల్లువిరిశాయి.

  • Published Feb 21, 2024 | 2:40 PMUpdated Feb 21, 2024 | 2:40 PM
తండ్రైన హీరో నిఖిల్.. ఫోటో వైరల్

తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న హీరోల్లో ఒకరు నిఖిల్ సిద్దార్థ. హిట్టూ.. ఫ్లాపు తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన నిఖిల్  ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీతో మంచి పేరు సంపాదించాడు. తర్వాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య vs సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడ ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. తాజాగా హిరో నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. వివరాల్లోకి వెళితే..

హిరో నిఖిల్ సిద్దార్థ ఇంట ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి.  నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. తాను తండ్రి అయ్యానని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ఇటీవల కొద్దిమంది సన్నిహితులు, బంధువు మధ్య పల్లవి వర్మ సీమంతం ఫంక్షన్ నిర్వహించారు.. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్ సిద్దార్థ-పల్లవి వర్మ కొంతకాలం ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో 2020, మే 14న వివాహబంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా పండంటి మగ బిడ్డ తమ జీవితంలోకి రావడంతో ఈ కపుల్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు హీరో నిఖిల్. ఇటీవల కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్నాడు. భారీ వసూళ్లు రాబట్టి.. వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై మూవీస్ ఊహించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ రెండు చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ‘స్వయంభూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. నిఖిల్ ఇంట వారసుడొచ్చిన విషయం తెలుసుకొని సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet