iDreamPost
android-app
ios-app

Niharika: వివాహం తర్వాతే ఆ విషయం తెలిసింది.. అందుకే విడిపోయాం: నిహారిక

  • Published Jan 26, 2024 | 11:03 AM Updated Updated Jan 26, 2024 | 11:47 AM

మెగా డాటర్‌ నిహారిక.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తొలిసారి తన డైవర్స్‌పై స్పందించింది. ఆ వివరాలు..

మెగా డాటర్‌ నిహారిక.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తొలిసారి తన డైవర్స్‌పై స్పందించింది. ఆ వివరాలు..

  • Published Jan 26, 2024 | 11:03 AMUpdated Jan 26, 2024 | 11:47 AM
Niharika: వివాహం తర్వాతే ఆ విషయం తెలిసింది.. అందుకే విడిపోయాం: నిహారిక

కొణిదేల నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి తమ్ముడు, నాగబాబు కుమార్తె మెగా డాటర్‌గా అందరికి పరిచయం. కానీ తనను తాను నిరూపించుకోవడం కోసం ఇండస్ట్రీలోకి వచ్చింది. షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటిస్తూ.. యాంకర్‌గా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటిగా నిరూపించుకోవడం కోసం సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని మూవీల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వివాహం చేసుకుంది.

అదే సమయంలో ప్రొడక్షన్‌ కూడా స్టార్ట్ చేసింది. నిహారిక పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై వెబ్‌ సిరీస్‌లను నిర్మించింది. విడాకుల తర్వాత మొదటిసారి బిగ్‌ ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసి సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక యూట్యూబర్‌ నిఖిల్‌ విజేయేంద్ర సింహాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనిలో తొలిసారి ఆమె విడాకులపై స్పందించింది. అంతేకాక తమ ఇద్దరికి లవ్‌ మ్యారేజ్‌ కాదని… అరెంజ్డ్‌ మ్యారేజ్‌ అని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

Niharika reacts to the divorce for the first time

నిహారిక విడాకులపై స్పందిస్తూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాను. అమ్మనాన్నలని వదిలి ఎప్పుడూ ఉండలేదు. వాళ్లు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది ఓ సమయంలో అమ్మవాళ్లు లేకుండా నేను 15 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు ఒక్క పని కూడా సొంతంగా చేయడం తెలియలేదు. అప్పుడు అర్థమైంది.. నేను అమ్మవాళ్ల ఎంతలా ఆధారపడి ఉన్నానో అప్పుడు అర్థమైంది. అదే పెళ్లి విషయానికి వచ్చే సరికి.. పూర్తిగా మారిపోతుంది. ఇంకో వ్యక్తితో జీవితం ప్రారంభించే ముందు వాళ్లు మీ గురించి ఎలా ఆలోచిస్తారో.. మిమ్మల్ని ఎలా చూసుకుంటారో మీకు తెలియదు’’ అన్నది.

‘‘మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి.. మీ అమ్మానాన్నలా మిమ్మల్ని చూసుకుంటారా లేదా అన్నది మీకు తెలియదు. అలాంటప్పుడు మనం తప్పుడు వ్యక్తి మీద ఆధారపడకూడదు. అదే పరిస్థితి వస్తే.. మీ పరిస్థితి శూన్యం అన్నట్లుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి ఎలాంటి ఆధారం దొరుకుతుందో అర్థం కాదు.. ఒకసారి దొరకదు కూడా. అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. అందుకే విడాకులు తీసుకున్నాను. ఎవరినీ అంత త్వరగా నమ్మకూడదనే విషయం పెళ్లి తర్వాతనే తెలిసింది. ఇప్పటికి డైవర్స్‌ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను ఒంటిరిగా ఉన్నాను.. కానీ సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తన కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచారు. అలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

విడిపోయిన తర్వాత నిహారిక ఎక్కడా కూడా తన విడాకుల గురించి మాట్లాడలేదు. అటు చైతూ కూడా విడిపోవడంపై ఎక్కడా స్పందించలేదు. ఇద్దరూ తమ లైఫ్ లో బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత తర్వాత నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది. రోజూ రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొట్టింది. తాజాగా విడాకుల పై తొలి సారి స్పందించింది నిహారిక.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet