iDreamPost
android-app
ios-app

నిహారిక ప్రయోగం! 11 మందిని హీరోలుగా పరిచయం చేస్తూ!

  • Published Mar 26, 2024 | 5:09 PM Updated Updated Mar 26, 2024 | 5:09 PM

మెగా డాటర్ నిహారిక అటు నిర్మాతగా.. ఇటు నటిగా ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాతగా స్టార్ చేసిన తొలి ఫీచర్ ఫిలిం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మెగా డాటర్ నిహారిక అటు నిర్మాతగా.. ఇటు నటిగా ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాతగా స్టార్ చేసిన తొలి ఫీచర్ ఫిలిం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

  • Published Mar 26, 2024 | 5:09 PMUpdated Mar 26, 2024 | 5:09 PM
నిహారిక ప్రయోగం! 11 మందిని హీరోలుగా పరిచయం చేస్తూ!

మెగా వారసులు ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. కానీ వారసురాలిగా వచ్చి నటిగా సత్తా చాటింది మాత్రం నాగ బాబు గారాల పట్టీ నిహారిక. యాంకరింగ్, హీరోయిన్, ప్రొడక్షన్ హౌస్ అధినేతగా .. బిజీగా మారింది నిహారిక కొణిదెల. హీరోయిన్‌గా ఒక మనస్సు చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా.. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. హ్యాపీ వెడ్డింగ్, సూర్య కాంతం మూవీలో తనదైన నటనతో మెప్పించింది. పింక్ ఎలిఫెంట్ ఫిక్చర్స్ నిర్మాణ సంస్థ స్థాపించి.. ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హెల్లో వరల్డ్ వెబ్ సిరీస్, పొట్టి సినిమాలు నిర్మించింది. 2020లో చైతన్యను నిహారిక వివాహం చేసుకోగా.. ఈ జంట 2023లో విడిపోయింది. తాజాగా పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్న సంగతి విదితమే.

ఇప్పుడు ఆ ఫేజ్ నుండి బయటకు వచ్చిన కొణిదెల డాటర్.. నిర్మాతగా బిజీగా మారింది. తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సమర్పణలో తొలి సారిగా ఓ ఫీచర్ ఫిలింను షురూ చేసిన సంగతి విదితమే. గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో 11 మంది హీరోలు, హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. అంటే మొత్తంగా ఓ క్రికెట్ టీమ్ తయారైంది. ఈ సినిమాను డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంతకు ఆ కమిటీ కుర్రాళ్లు ఎవరంటే.. ప్రసాద్ బెహరా(యూట్యూబర్), ఈ శ్వర్ రచిరాజు, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి హీరో, హీరోయన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సింగర్ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పింక్ ఎ లిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలౌతున్నట్లు తెలుస్తోంది. నిహారిక కూడా హీరోయిన్‌గా వాట్ ద ఫిష్, మద్రాస్‌కారన్ అనే చిత్రాల్లో నటిస్తోన్న సంగతి విదితమే. అలాగే ఆహాలో చెఫ్ మంత్ర షో చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss