iDreamPost
android-app
ios-app

కమిటీ కుర్రాళ్ళు ప్రెస్ మీట్ లో వారిపై నిహారిక కంప్లైంట్!

  • Published Aug 08, 2024 | 5:04 PM Updated Updated Aug 08, 2024 | 5:04 PM

Niharika Konidela: కొణిదెల నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే యాక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమావేశంలో నిహారికా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Niharika Konidela: కొణిదెల నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే యాక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమావేశంలో నిహారికా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Aug 08, 2024 | 5:04 PMUpdated Aug 08, 2024 | 5:04 PM
కమిటీ కుర్రాళ్ళు ప్రెస్ మీట్ లో వారిపై నిహారిక కంప్లైంట్!

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. కొందరు నటులుగా, మరికొందరు ప్రొడ్యూసర్లుగా మారుతుంటారు. మరికొందరు నటులుగా ఉంటూనే నిర్మాతలుగా రాణిస్తుంటారు. అలాంటి వారిలో మెగా డాటర్ కొణిదెల నిహారిక ఒకరు. ఆమె నటిగా పలు సినిమాల్లో నటించడమే కాకుండా.. ప్రొడ్యూసర్ గా కూడా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది. తాజాగా నిహారిక నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక తాజాగా వెబ్ అండ్ ప్రింట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టాలీవుడ్ మేకర్స్ పై నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో నిహారిక పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. టాలీవుడ్ లో కాకుండా.., మీరు కోలీవుడ్ నటిగా బిజీ అవుతున్నారు. ఇందుకు కారణం ఏమిటి అన్న ప్రశ్నకు నిహారిక నుండి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది. “టాలీవుడ్ దర్శకనిర్మాతలు అసలు ముందుగా నన్ను అప్రోచ్ కావడం లేదు. నాకు ఆ సబ్జెక్టు నచ్చదనో, నేను చిన్న రోల్స్ చేయను అనో, నాతో మూవీ అంటే ఎక్కువ స్టోరీ సిట్టింగ్స్ ఉంటాయనో వంటి అభిప్రాయాలను వారికై వారే ఏర్పర్చుకుంటున్నారు. అసలు ముందుగా నా దగ్గరికి ఆ కథలతో వస్తే కదా అవి నాకు నచ్చుతాయో, లేదో తెలిసేది. మంచి కథ, మంచి పాత్ర దొరికితే నేను ఎవరితో అయినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతా అనుష్క, సమంతలా నేను లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తా అని అనుకుంటున్నారు. అది తప్పు. అనుష్క, సమంత కూడా ముందుగా కమర్షియల్ మూవీస్ చేశాకనే, ఒక స్టార్డమ్ వచ్చాక లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేశారు. నేను అందుకు అతీతం కాదు” అని నిహారిక తన మనసులోని బాధని బయటపెట్టారు.

మరోవైపు కమిటీ కుర్రాళ్లు సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే యాక్ట్ చేశారు. ఒక ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ జ్ఞాపకాలు, ఆ ఊళ్ళో జరిగే జాతర, ఆ ఊరి రాజకీయాలు, వాళ్ళ లవ్ స్టోరీలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి. ఆగష్టు 9వ తేదీన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక నిహారిక ఇప్పటికే తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో “వాట్ దా ఫిష్” మూవీలో ఇప్పటికే ఫైనల్ అయ్యింది. మరి.. నిహారిక విషయంలో ఇకనైనా అపోహలు తొలగిపోయి.. టాలీవుడ్ మేకర్స్ నుండి తగిన సపోర్ట్ లభిస్తుంది ఏమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet