iDreamPost
android-app
ios-app

Niharika: నిహారిక ఇంటర్వ్యూపై స్పందించిన మాజీ భర్త చైతన్య.. షాకింగ్‌ కామెంట్స్‌

  • Published Jan 26, 2024 | 6:24 PM Updated Updated Jan 26, 2024 | 6:52 PM

Chaitanya-Niharika Interview: ఓ యూట్యూబర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తొలిసారి విడాకుల అంశంపై స్పందించింది. అయితే దానిపై ఆమె మాజీ భర్త చైతన్య స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ వివరాలు..

Chaitanya-Niharika Interview: ఓ యూట్యూబర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తొలిసారి విడాకుల అంశంపై స్పందించింది. అయితే దానిపై ఆమె మాజీ భర్త చైతన్య స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆ వివరాలు..

  • Published Jan 26, 2024 | 6:24 PMUpdated Jan 26, 2024 | 6:52 PM
Niharika: నిహారిక ఇంటర్వ్యూపై స్పందించిన మాజీ భర్త చైతన్య.. షాకింగ్‌ కామెంట్స్‌

విడాకుల తర్వాత మెగా డాటర్‌ నిహారిక ప్రొడక్షన్‌ హౌజ్‌ ప్రారంభించి.. సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. షార్ట్‌ ఫిలిమ్స్‌, యాంకరింగ్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నిహారిక. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తెలుగులో మూడు సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. అనంతరం సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి జరిగింది. ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక నిర్వహించారు. అయితే 2020లో వీరి వివాహం జరగ్గా.. ఆ తర్వాత రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. గతేడాది ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నిహారిక, చైతన్య తమ విడాకుల అంశంపై ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా నిహారిక యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్రసింహకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాలు వివరించింది.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనుషులను త్వరగా నమ్మకూడదనే విషయం తనకు పెళ్లి తర్వాతే తెలిసింది అన్నది నిహారిక. అంతేకాక పెళ్లికి ముందు తల్లిదండ్రలు మీద ఆధారపడతామని.. కానీ వివాహం తర్వత తప్పుడు వ్యక్తి మీద ఆధారపడితే.. జీవితం శూన్యం అవుతుందని చెప్పుకొచ్చింది. అయితే విడాకుల తర్వాత తన కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని.. తాను సంతోషంగా ఉండటమే తన కుటుంబానికి ముఖ్యమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉన్నాను అన్నది. నాగబాబు లాంటి తండ్రి దొరకడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది నిహారిక. అంతేకాక తనకు ఇప్పుడు కేవలం 30 ఏళ్లే అని.. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పింది. ఈ వీడియో వైరల్‌ అయ్యింది.
Ex-husband Chaitanya is serious
అయితే తాజాగా ఈ వీడియోపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నిహారిక గురించి ఎక్కడా ప్రస్తావించకుండా.. ఆమెని ఇంటర్వ్యూ చేసిన నిఖిల్‌ విజయేంద్ర సింహపై సీరియస్‌ అయ్యాడు. విడాకులపై పరోక్షంగా తన వైపు గల కారణాలు చెప్పే ప్రయత్నం చేశాడు చైతన్య. ‘‘హాయ్‌ నిఖిల్‌.. నిహారిక మీద నెగిటివిటీ రాకుండా చూసుకునేందుకు నువ్వు చేస్తోన్న ప్రయత్నం బాగానే ఉంది. కాక పోతే ఆలస్యం అయ్యింది. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొవడం అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా మీరు పరోక్షంగా బాధితురాలు అనే ట్యాగ్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాలు మానుకొండి’’ అని సూచించాడు. నిఖిల్‌ ఇలా చేయడం ఇది రెండో సారి అని చెప్పుకొచ్చాడు చైతన్య.
‘‘విడాకుల విషయంలో బాధ, దానిలో నుంచి బయటపడటం అనేది రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఆబాధ నుంచి ఎలా బయటపడ్డామనే దాని గురించి మాట్లాడితే.. అది జనాలకు ఉపయోగపడుతుంది. దేని గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా.. ఓ నిర్ణయానికి రావడం అనేది సరైంది కాదు. దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. అలానే ఇలాంటి వేదికల మీద నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించే ప్రయత్నాలు చేయడం కూడా అంతే తప్పు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు’’ అంటూ నిఖిల్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన నిహారిక వీడియో ప్రోమో కింద కామెంట్‌ చేశాడు చైతన్య జొన్నలగడ్డ. ప్రస్తుతం ఇది వైరవలవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)