iDreamPost
android-app
ios-app

తొలిసారి విడాకులపై స్పందించిన నిహారిక-చైతన్య… ఏమన్నారంటే!

  • Published Jul 05, 2023 | 2:42 PM Updated Updated Jul 06, 2023 | 5:49 PM
  • Published Jul 05, 2023 | 2:42 PMUpdated Jul 06, 2023 | 5:49 PM
తొలిసారి విడాకులపై స్పందించిన నిహారిక-చైతన్య… ఏమన్నారంటే!

మెగా డాటర్‌ నిహారిక విడాకుల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిహారిక, ఆమె భర్త చైతన్య విడాకులు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం దీని గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. చాలా రోజులుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నిహారిక పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ ప్రారంభించి.. సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉంది. పెళ్లిక ముందు వరకు యాక్టింగ్‌ చేసిన నిహారిక.. ప్రస్తుతం నిర్మాతగా మారింది. నెల రోజుల క్రితమే నిహారిక-చైతన్య హైదరాబాద్‌, కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. వీరి విడాకులపై నెటిజనులు రకరకాల కామెంట్స్‌ చేస్తుండటంతో.. డైవర్స్‌ తర్వాత తొలిసారి నిహారిక-చైతన్య తమ విడాకులపై స్పందించారు.

విడాకుల అంశంపై నిహారిక-చైతన్య స్పందిస్తూ.. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘విడాకులకు సంబంధించి మేమిద్దరం పరస్సర అంగీకారంతోనే నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో మా ఇద్దరికి కాస్త ప్రైవసీ అవసరం. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో.. నా కుటుంబం, స్నేహితులు నాకు పిల్లర్స్‌లా మద్దతుగా నిలిచారు. మీ అందరికి నా విజ్ఞప్తి ఒకటే. దయచేసి మాపై నెగిటివ్‌ ప్రచారం చేయకండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. ఒంటరిగా వదిలేయండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము’’ అంటూ ఇద్దరు తమ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి.

గత కొంతకాలంగా నిహారిక-చైతన్య విడి విడిగానే ఉంటున్నారు. ఇన్‌స్టాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడమే కాక.. పెళ్లి ఫోటోలను కూడా డిలీట్‌ చేయడంతో విడాకులు రూమర్స్‌ ఊందుకున్నాయి. పుకార్లు నిజం చేస్తూ.. పెళ్లైన రెండున్నరేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2020, డిసెంబర్‌ 9 నిహారిక-చైతన్యల వివాహం.. రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పెళ్లైన రెండున్నరేళ్లకే వారు విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet