iDreamPost
android-app
ios-app

స్టార్‌ హీరోయిన్లకు మించి.. నిమిషానికి రూ.కోటి పారితోషికం తీసుకుంటున్న నటి.. ఎవరంటే!

  • Published Jul 11, 2023 | 11:13 AM Updated Updated Jul 11, 2023 | 11:22 AM
  • Published Jul 11, 2023 | 11:13 AMUpdated Jul 11, 2023 | 11:22 AM
స్టార్‌ హీరోయిన్లకు మించి.. నిమిషానికి రూ.కోటి పారితోషికం తీసుకుంటున్న నటి.. ఎవరంటే!

మన దగ్గర హీరోల రెమ్యూనరేషన్‌తో పోలిస్తే.. హీరోయిన్లు అందుకునే పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. ఆఖరికి అది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమైనా సరే.. హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం.. హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సినిమాకు ఒక హీరో 50-60 కోట్ల రూపాయలు తీసుకుంటే.. హీరోయిన్‌కు అందులో పది శాతం ఇచ్చినా చాలా ఎక్కువే. ఆఖరికి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు అయిన దీపికా పదుకోన్‌, ఆలియా భట్‌, కంగనా వంటి తారలు సైతం హీరోలకు సమానమైన రెమ్యూనరేషన్‌ అందుకోవడం లేదు. ఈ క్రమంలో ఓ నటి మాత్రం ఏకంగా నిమిషానికి కోటి రూపాయలు చొప్పున పారితోషికం తీసుకుంటూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇంతకు ఆమె స్టార్‌ హీరోయినా ఆ అంటే కాదు.. మరి నిమిషానికి కోటి రూపాయలు పారితోషికం అందుకుంటున్న ఆ నటి ఎవరంటే..

బాలీవుడ్‌లో నిమిషానికి కోటి రూపాయల పారితోషికం అందుకుంటూ.. టాక్‌ ఆఫ్‌ది బీటౌన్‌గా నిలిచింది ఓ హీరోయిన్‌. ఆమె ఒక్క నిమిషం సినిమాలో కనిపించడానికి రూ.1 కోటి వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి స్టార్‌ హీరోయిన్లు కూడా ఆ రేంజ్‌లో పారితోషికం ఇవ్వడం లేదు కదా.. మరి ఈ ముద్దుగుమ్మకు ఎందుకు ఇస్తున్నారు.. ఆమెలో ప్రత్యేకత ఏంటి.. ఇంతకు ఎవరా నటి అంటే.. ఆమె ‘వాల్తేరు వీరయ్య’లో ‘‘వేరీజ్ ది పార్టీ..’’ అంటూ చిందులేసిన ఐటెమ్ భామ ఊర్వశీ రౌతేలా. అవును మీరు విన్నది నిజమే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాక సౌత్‌లో కూడా ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాటను తూచా తప్ప​కుండా పాటిస్తోంది ఈ భామ. దాంతో తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. నిమిషానికి రూ.కోటి చొప్పున వసూలు చేస్తుందట.

చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో స్పేషల్‌ సాంగ్‌లో నటించేందుకు ఊర్వశీ ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఊర్వశీకి టాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీలో ‘‘వైల్డ్ సాలా..’’ అంటూ డ్యాన్స్ ఇరగదీసింది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘బ్రో’ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో కూడా నటించింది. ఈ పాటలో సితార మంజరీగా ఆకట్టుకుంది. అంతేకాక ‘బ్రో’ మూవీతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్కంద’ మూవీలో కూడా ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో నటించే చాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్‌లో 3 నిమిషాలు కనిపించేందుకు ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట.

దీంతో నిమిషానికి రూ.కోటి చొప్పున వసూలు చేస్తోన్న ఊర్వశీ అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో ఊర్వశీకే తెలియాలి. ఈ వార్తలు కనుక వాస్తవం అయితే.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ కంటే ఇది చాలా ఎక్కువ. అదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ఊర్వశీ టాప్‌లో ఉండటం ఖాయం అంటున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom