Swetha
పాన్ ఇండియా వైడ్ డార్లింగ్ కి ఉన్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. కల్కి తర్వాత మరోసారి ప్రభాస్ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడా అని అంతా తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాజాసాబ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

కనీసం ఏడాది రెండు సినిమాలైనా తీస్తానని డార్లింగ్ తన అభిమానులకు మాట ఇచ్చాడు. ఆ మాట కచ్చితంగా నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఇటు అభిమానులలో కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్ లైన్ అప్స్ గురించి అందరికి తెలిసిందే. మరో మూడేళ్ళ పాటు ప్రభాస్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత కూడా ఏమైనా ప్రాజెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నాయో లేదో ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకు ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ , గ్లిమ్ప్స్ తో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు డీలా పడిపోయారు. కానీ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వారికి ఊరటనిచ్చింది.
అదేంటంటే ఈ మూవీ షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయిందట. ప్రస్తుతానికి సంజయ్ దత్ కు సంబందించిన సీన్స్ పై షూటింగ్ జరుగుతుందట. సో తర్వాత సీన్ లోకి ప్రభాస్ ఎంటర్ అవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మూవీ టీం సిజి వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చాలా రకాల జంతువులను క్రియేట్ చేయబోతున్నారట. వాటితో ఎలాంటి కంటెంట్ ను చూపించబోతున్నారనే క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. ఇక మరోవైపు మూవీకి సంబందించిన టీజర్ ను కూడా రెడీ చేస్తున్నారట మేకర్స్. సో వీలైనంత త్వరగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ టీజర్ ప్రేక్షకులలో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.