iDreamPost
android-app
ios-app

Raja Saab: రాజా సాబ్ రిలీజ్ పై క్రేజీ అప్ డేట్! పెద్దోళ్లతోనే పోటీ!

  • Published Feb 06, 2024 | 5:03 PM Updated Updated Feb 06, 2024 | 5:03 PM

ఈ ఏడాది సంక్రాంతి సినీ ఫెస్టివల్ అయిపోయింది . ఇది ఇలా అయిందో లేదో మేకర్స్ అంతా అప్పుడే వచ్చే ఏడాది సంక్రాతికి .. అప్పుడే స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమా కూడా ఉండబోతుందట మరి.

ఈ ఏడాది సంక్రాంతి సినీ ఫెస్టివల్ అయిపోయింది . ఇది ఇలా అయిందో లేదో మేకర్స్ అంతా అప్పుడే వచ్చే ఏడాది సంక్రాతికి .. అప్పుడే స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమా కూడా ఉండబోతుందట మరి.

  • Published Feb 06, 2024 | 5:03 PMUpdated Feb 06, 2024 | 5:03 PM
Raja Saab: రాజా సాబ్ రిలీజ్ పై క్రేజీ అప్ డేట్! పెద్దోళ్లతోనే పోటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ అంటే .. ముందుగా గుర్తొచ్చేది మాత్రం రెబల్ స్టార్ “ప్రభాస్”. కొన్నేళ్లుగా ప్లాప్ సినిమాలతో అభిమానులను నిరాశ పరిచిన డార్లింగ్.. సలార్ తో ఆ లోటు తీర్చేసాడు. ఇక ఆ తర్వాత కూడా ప్రభాస్ సినిమాల ఊపు కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సలార్ సాధించిపెట్టిన క్రేజ్ అంత ఇంతా కాదు. బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టేసింది. సలార్ గ్రాండ్ సక్సెస్ తర్వాత .. డార్లింగ్ నుంచి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనితో అభిమానులంతా ఎంతో ఆశగా .. రాబోయే డార్లింగ్ చిత్రాల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడబోతుంటే ఈసారి వరుస సినిమాలతో ప్రభాస్ అభిమానులను అసలు నిరాశ పరిచేలా లేడు. అయితే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన “రాజా సాబ్” రిలీజ్ డేట్ పై తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది.

అభిమానులంతా డార్లింగ్ ను రొమాంటిక్ లుక్ లో చాలా కాలం అయిపోయింది. యాక్షన్ , మాస్ యాంగిల్ లో ప్రభాస్ ఎప్పుడు అదరగొడుతూనే ఉంటాడు. ప్రభాస్ నుంచి ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ , సలార్ -2 చిత్రాలు క్యూలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కల్కి సినిమా దాదాపు షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత లైన్ లో ఉన్న చిత్రం “రాజా సాబ్”. ఇప్పటికే రిలీజ్ అయిన రాజా సాబ్ పోస్టర్ లో .. డార్లింగ్ లుక్ ని చూసిన అభిమానులు.. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పోస్టర్ తప్ప .. ఇక ఏ అప్ డేట్స్ లేవు. పైగా ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి అవుతుందని తెలుస్తోంది.

“రాజా సాబ్” చిత్రం మారుతీ దర్శకత్వంలో రాబోతుందని తెలిసిందే. అయితే తాజాగా ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో .. రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియాజేశారు. అయితే , ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ లో ఉన్నాయని .. అడుగగా.. అవును కానీ, ప్రభాస్ వస్తే సెపరేట్ స్లాట్ ఉండాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు విశ్వ ప్రసాద్. ఏదేమైనా ప్రభాస్ కూడా సంక్రాంతి బరిలో దిగితే.. ఇక వచ్చే ఏడాది గట్టి పోటీ ఉంటుందని చెప్పి తీరాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet