iDreamPost
android-app
ios-app

కల్కి 2 మీద న్యూ అప్డేట్.. షూట్ స్టార్ట్ అప్పుడేనా!

  • Published Nov 26, 2024 | 4:29 PM Updated Updated Nov 26, 2024 | 4:29 PM

Kalki 2 Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటుంటే ఒక్కొక్కరికి కంటి మీద కునుకు ఉండట్లేదు. ఆ స్పీడ్ కి ఆ లైన్ అప్ కి అంతా అల్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమాల వస్తాయా.. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Kalki 2 Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటుంటే ఒక్కొక్కరికి కంటి మీద కునుకు ఉండట్లేదు. ఆ స్పీడ్ కి ఆ లైన్ అప్ కి అంతా అల్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమాల వస్తాయా.. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

  • Published Nov 26, 2024 | 4:29 PMUpdated Nov 26, 2024 | 4:29 PM
కల్కి 2 మీద న్యూ అప్డేట్.. షూట్ స్టార్ట్ అప్పుడేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటుంటే ఒక్కొక్కరికి కంటి మీద కునుకు ఉండట్లేదు. ఆ స్పీడ్ కి ఆ లైన్ అప్ కి అంతా అల్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమాల వస్తాయా.. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న వాటిలో రాజాసాబ్ మూవీ అందరిని ఊరిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇలా ప్రభాస్ లైన్ అప్స్ గురించి అడపా దడపా ఏవో ఒక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఈ స్కై ఫై మైథాలజీ మూవీ ప్రేక్షకులను ఎన్నో విషయాల గురించి చర్చించుకునేలా చేసింది. మెయిన్ గా ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసి.. ఆకాశం అంత ఎత్తున సెటిల్ అయిపోయింది. ఈ సినిమాకు సిక్వెల్ ఉందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కల్కి గురించి అంత బజ్ ఏమి వినిపించడం లేదు. కానీ రీసెంట్ గా గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌ జరిగింది. ఆ ఈవెంట్ లో కల్కి సినిమా స్పెషల్ యాట్రక్షన్ గా నిలిచింది. ఇలాంటి ఓ యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా తీయడంతో.. నాగ్ ను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.ఈ క్రమంలోనే పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పార్ట్ 2 లో ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రభాస్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు కాబట్టి. డార్లింగ్ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ కంప్లీట్ చేసి.. 2026 లో సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రభాస్ ఇప్పటికే రాజా సాబ్ , ఫౌజీ, స్పిరిట్ చిత్రాలను తెరకెక్కించనున్నాడు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి సమయం పడుతుండడంతో.. కల్కి 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి కల్కి 2 సెకండ్ పార్ట్ ను 2025 లో స్టార్ట్ చేయాలనే ప్లాన్ చేశారు మేకర్స్. కానీ నాగ్ స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదని.. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఈ మూవీ 2026 సెకండ్ ఆఫ్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా మూవీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రభాస్ బిజీ గా ఉన్న మాట వాస్తవమే. కానీ దాదాపు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు వచ్చే ఏడాదికి పూర్తి కంప్లీట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. కాబట్టి కల్కి సినిమా మరి అంత ఆలస్యం అయ్యే ఛాన్స్ లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మూవీ టీం నుంచైతే ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom