iDreamPost
android-app
ios-app

అక్కడ గేమ్ ఛేంజర్ కు రిస్క్! ఇలా అయితే కష్టమే

  • Published Sep 25, 2024 | 2:41 PM Updated Updated Sep 25, 2024 | 2:46 PM

Game Changer Movie Update: ఇప్పుడిప్పుడే గేమ్ ఛేంజర్ పేరు బయటకు వస్తుంది . కానీ ఇంతలోనే సినిమాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎదురౌతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి అదేంటో చూసేద్దాం.

Game Changer Movie Update: ఇప్పుడిప్పుడే గేమ్ ఛేంజర్ పేరు బయటకు వస్తుంది . కానీ ఇంతలోనే సినిమాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎదురౌతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి అదేంటో చూసేద్దాం.

  • Published Sep 25, 2024 | 2:41 PMUpdated Sep 25, 2024 | 2:46 PM
అక్కడ  గేమ్ ఛేంజర్ కు రిస్క్!  ఇలా అయితే కష్టమే

గేమ్ ఛేంజర్ సినిమా మీద మెగా అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. అంతే భయంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అవార్డులు రివార్డ్ లతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ట్రిపుల్ ఆర్ కు ముందు రామ్ చరణ్ వేరు.. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ వేరు.. అనే రేంజ్ లో మేక్ ఓవర్ చూపించాడు. మరి ఇంత చేంజ్ అయినా తర్వాత ఫ్యాన్ ఎందుకు ఊరుకుంటారు. తన నెక్స్ట్ సినిమాలపై అమాంతం అంచనాలను పెంచుకున్నారు. రామ్ చరణ్- శంకర్ దర్శకత్వంలో మూవీ అనౌన్స్ చేయడం.. గేమ్ ఛేంజర్ అంటూ మూవీ నేమ్ అనౌన్స్ చేయడం.. ఇంత వరకు అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భారతీయుడు ప్లాప్ అయిందో.. అలాగే అసలు గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్స్ రావడం ఆగిపోయాయో.. అప్పటినుంచి అసలు టెన్షన్ మొదలైంది. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ సింగల్ తో ట్రాక్ లో పడుతుంది అనుకుంటే.. ఇంతలోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎదురౌతున్నాయి. అదేంటో చూసేద్దాం.

రామ్ చరణ్ క్రేజ్ కేవలం టాలీవుడ్ లోనే కాదు.. అటు ఓవర్శిస్ లోను బాగానే ఉంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్ వలనే ఏకంగా మ్యాగజైన్ మీద కూడా చరణ్ ఫోటోలు ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ చరణ్ నుంచి రిలీజ్ కాబోయే సినిమాలకు కూడా అదే క్రేజ్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు .గేమ్ ఛేంజర్ నుంచి ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా జరగండి జరగండి సాంగ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుమించి ఏ అప్డేట్ రాలేదు. ఇక లేక లేక గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా దీనిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతలోనే అదిరిపోయే ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబర్ 20 న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ ఏ ఓవర్శిస్ లో గేమ్ ఛేంజర్ ను రిస్క్ లో పెడుతుంది . ఎందుకంటే ముఫాసా : ది లయన్ కింగ్ మూవీ.. కూడా అదే రోజున రానుంది. ఇది మోస్ట్ అవైటెడ్ మూవీ కావడంతో.. ఓవర్శిస్ లో ఈ సినిమాకు ఎక్కువ థియేటర్స్ వెళ్లిపోతాయి. సో గేమ్ ఛేంజర్ కు స్క్రీన్స్ తగ్గిపోతాయి.

ఇక హిందీలో బేబీ జాన్ , అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ మూవీస్ రానున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా విపరీతమైన బజ్ ఉంది. సో అక్కడ కూడా గేమ్ ఛేంజర్ కు స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. మరి వీటిని రామ్ చరణ్ ఎలా మేనేజ్ చేసి నెగ్గుకొస్తాడో చూడాలి. సెప్టెంబర్ 27న దేవర మూవీ రిలీజ్ రోజునే.. థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఇప్పటినుంచైనా గేమ్ ఛేంజర్ పై.. అసలైన హైప్ కొనసాగుతుందేమో చూడాలి. మరి చరణ్ తనపై ఫ్యాన్స్ పెంచుకున్న అంచనాలను రీచ్ అవుతాడా లేదా అనేది ఈ మూవీ డిసైడ్ చేయనుంది. ఇక నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş