iDreamPost
android-app
ios-app

పుష్ప-2 కౌంట్ డౌన్ స్టార్ట్.. న్యూ పోస్టర్ చూశారా !

  • Published Sep 23, 2024 | 2:18 PM Updated Updated Sep 23, 2024 | 2:18 PM

Pushpa-2 Movie Update : ఇప్పుడు ప్రేక్షకులు దేవర హైప్ లో మునిగితేలుతున్నారు. ఈ హైప్ నుంచి బయటకు వచ్చే లోపే అల్లు అర్జున్ పుష్ప-2 క్రేజ్ మొదలైపోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. తాజాగా ఓ కొత్త పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Pushpa-2 Movie Update : ఇప్పుడు ప్రేక్షకులు దేవర హైప్ లో మునిగితేలుతున్నారు. ఈ హైప్ నుంచి బయటకు వచ్చే లోపే అల్లు అర్జున్ పుష్ప-2 క్రేజ్ మొదలైపోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. తాజాగా ఓ కొత్త పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 23, 2024 | 2:18 PMUpdated Sep 23, 2024 | 2:18 PM
పుష్ప-2 కౌంట్ డౌన్ స్టార్ట్.. న్యూ పోస్టర్ చూశారా !

అసలైతే ముందుగా అనుకున్న దాని ప్రకారం పుష్ప-2 సినిమా కనుక రిలీజ్ అయితే.. ఇప్పటికి ఆ మూవీ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండే వారు. ఎందుకంటే ఈ మూవీపై ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలు అలాంటివి. అంతే కాకుండా అప్పటివరకు పుష్ప-2 నుంచి రిలీజ్ చేసిన అప్డేట్స్ కూడా అదే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసాయి. దీనితో ఎలాగైనా పుష్ప-2 మూవీ రికార్డ్స్ తిరగ రాయడం ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఊహించని విధంగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ తర్వాత న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ సమయం కూడా దగ్గర పడుతుంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అదేంటో చూసేద్దాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. ఆ మూవీకి సిక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు.. ఇటు ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఇంకా కేవలం మూవీ రిలీజ్ కు 75 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ విషయాన్నే కేవలం 75 రోజులలో పుష్ప రాజ్ రూలింగ్ చూడబోతున్నారంటూ ఓ స్పెషల్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్టోబర్ చివరికి మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. చూడబోతుంటే… ఆగష్టు లో మిస్ అయినా రికార్డ్స్ డిసెంబర్ లో లెక్క తేల్చేలా ఉన్నారు.

ఇక ప్రస్తుతం ప్రేక్షకులంతా దేవర మూవీ క్రేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీపై ఎలాంటి హైప్ కొనసాగుతుందో.. రిలీజ్ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ హైప్ నుంచి బయటకు వచ్చే లోపే.. ఎక్కడా గ్యాప్ లేకుండా పుష్ప-2 అప్డేట్స్ రానే వస్తాయి. కాబట్టి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ సినిమాలే రానున్నాయి. మరి ఏ మూవీ ఇందులో రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet