iDreamPost
android-app
ios-app

నటుడు ప్రియదర్శి గాయంపై నెటిజన్ల కామెంట్స్! పిక్ వైరల్!

  • Author ajaykrishna Updated - 08:25 AM, Sat - 5 August 23
  • Author ajaykrishna Updated - 08:25 AM, Sat - 5 August 23
నటుడు ప్రియదర్శి గాయంపై నెటిజన్ల కామెంట్స్! పిక్ వైరల్!

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ క్యారెక్టర్ తో పాపులర్ అయిన ప్రియదర్శి.. ఆ తర్వాత కామెడీ రోల్స్ ఒక్కటే కాకుండా డిఫరెంట్ పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో నటుడిగా మల్లేశం లాంటి ఛాలెంజింగ్ రోల్ తో లీడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన ప్రియదర్శి.. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోను కంటిన్యూ అవుతున్నాడు. ఇక కామెడీ పరంగా జాతిరత్నాలు ఉండనే ఉంది. అందులో ఎంత నవ్వించాడో.. మల్లేశంలో ఏడిపించాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది బలగం సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టేశాడు.

ఇక థియేట్రికల్ సినిమాలే కాకుండా.. ఓటిటి ప్రాజెక్ట్ లలో సైతం నటుడిగా మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా ‘సేవ్ ది టైగర్స్’ అనే ఓటిటి సిరీస్ లో మంచి కామెడీ పండించాడు. బలగంతో హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ప్రియదర్శి.. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లోనే లీడ్ యాక్టర్ గా మరో సినిమా చేస్తున్నాడు. మొత్తానికి కెరీర్ పరంగా చేతినిండా సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు. అయితే.. కెరీర్ విషయం పక్కన పెడితే.. ప్రియదర్శి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతుంటాడు. రెగ్యులర్ గా కాకపోయినా ఎప్పుడు పోస్టులు పెట్టినా.. వెరైటీగా పోస్ట్ చేస్తుంటాడు. ఈసారి కూడా అలాంటి ట్విస్ట్ ఇచ్చాడు.

ప్రస్తుతం ప్రియదర్శి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా చర్చనీయంశంగా మారింది. తాజాగా పెట్టిన పోస్ట్ లో.. ప్రియదర్శి చొక్కా లేకుండా దర్శనమిచ్చాడు. దీంతో ఆ పిక్ గమనించిన నెటిజన్స్.. ప్రియదర్శి ఒంటిపై గాయం చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒంటి మీద గాయం కనిపిస్తుంది? ఏమైందని కొందరు అడుగుతుండగా.. సరిగ్గా గాయం అక్కడే కనిపిస్తుంది కిడ్నీలేమైనా అమ్మేశావా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరి ప్రియదర్శి గాయం షూటింగ్ లో భాగంగా జరిగిందా లేక సినిమా కోసం పెట్టిన గాయమా? అనే విధంగా ఆరా తీస్తున్నారు. కానీ.. మొత్తానికి గాయం మానుతుందని కాప్షన్ జోడించాడు ప్రియదర్శి. మరి ప్రియదర్శి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Priyadarshi Pulikonda (@preyadarshe)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet