iDreamPost
android-app
ios-app

యానిమల్ మూవీపై త్రిష పోస్ట్.. నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

  • Published Dec 05, 2023 | 10:04 PM Updated Updated Dec 05, 2023 | 10:04 PM

అందాల ముద్దుగుమ్మ నటి త్రిష మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ మూవీపై పోస్టు పెట్టిన నటి త్రిష నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది.

అందాల ముద్దుగుమ్మ నటి త్రిష మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ మూవీపై పోస్టు పెట్టిన నటి త్రిష నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది.

  • Published Dec 05, 2023 | 10:04 PMUpdated Dec 05, 2023 | 10:04 PM
యానిమల్ మూవీపై త్రిష పోస్ట్.. నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

గత కొన్నిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు గురించి అందరికి తెలిసిందే. దాదాపు 10 రోజులు ఈ వివాదంపై త్రీవ చర్చలు జరిగాయి. సౌత్ ఇండస్ట్రీ మొత్తం త్రిష పేరు మారుమోగిపోయింది. ఫైనల్ గా మన్సూర్ దీనిపై క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయితే తాజాగా మరోమారు ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఆమె చేసిన పోస్ట్ వల్ల నేటిజన్స్ త్రిషపై త్రీవ స్థాయిలో మండి పడుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా యానిమల్ రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన రోజు నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్-రష్మిక నటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబీనేషన్ లో వచ్చిన ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికి.. కొంతమంది మాత్రం ఈ సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణం.. ఈ చిత్రంలో హింసాత్మాక, స్త్రీ ద్వేషపూరితమైన కంటెంట్ ఉందంటూ విసృతంగా విమర్శిస్తున్నారు. అయితే యానిమల్ మూవీ యాక్షన్ సన్నివేశాల్లో రణ్ బీర్, బాబీ డియోల్ అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. కానీ, ఈ చిత్రంలో లైంగిక, గృహ హింసకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నయంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది ఈ చిత్రం.

ఇది ఇలా ఉంటే.. తాజాగా త్రిష యానిమల్ మూవీని సోషల్ మీడియాలో సమీక్షీంచి, దాని పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం పై త్రిష చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే త్రిష ఈ మూవీ పై ‘కల్ట్.. Pppppppaaaaaahhhhhhh’అని తన ఎక్స్ పేజిలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెటిజన్లకు అంతగా నచ్చలేదు. దీంతో త్రిష పెట్టిన పోస్టును నెటిజన్స్ తప్పుబట్టారు. వెంటనే.. త్రిష ఆ పోస్ట్ ను తన ఎక్స్ ఖాతా నుంచి తొలగించింది. అప్పటికే స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్స్ ఆ పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే గృహ హింస, లైంగిక హింస కలిగిన ఈ సినిమాని త్రిష ఎందుకు అంతా మెచ్చుకున్నారని చాలామంది విమర్శించారు. యానిమల్ లో ఎక్కువగా బోల్డ్ కు సంబంధించిన సన్నివేశలు ఉన్నాయి. చాలామంది పురుషులు కూడా ఈ మూవీని విమర్శిస్తున్నారు. అలాంటిది.. త్రిష ఎందుకు ఈ సినిమాని హైప్ చేస్తున్నారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అలాగే గతంలో మాన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూనే.. మరో పక్క మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే చిత్రానికి త్రిష ఎందుకు మద్ధతు ఇస్తున్నట్టు అని మరొక నెటిజన్ తెలిపాడు. మరి, త్రిష చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss