జూనియర్ ఎన్టీఆర్‌తో నెట్ ఫ్లిక్స్ CEO భేటీ!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్.. టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ నివాసానికి వెళ్లి చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి.. ముచ్చటించడం. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్.. టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ నివాసానికి వెళ్లి చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి.. ముచ్చటించడం. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా కాదూ గ్లోబల్ స్టార్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రం దేవర షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మూవీని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్న సంగతి విదితమే. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తోంది. తొలి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ తర్వాత మరో రెండు చిత్రాలను లైనప్‌లో పెట్టాడు యంగ్ టైగర్. బాలీవుడ్‌లో నేరుగా అడుగుపెట్టబోతున్నాడు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2లో తెరను పంచుకోనున్నాడు. అలాగే కేజీఎఫ్ సిరీస్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడొక ఇంటస్ట్రింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

అదే నెట్ ఫ్లిక్స్ అధినేత హైదరాబాద్ పర్యటన.. ఆర్ఆర్ఆర్ హీరోలను కలవడం. నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండో స్..ఇటీవల రామ్ చరణ్‌తో భేటీ అయ్యాడు. భాగ్యనగరిలో అడుగు పెట్టిన ఆయన చరణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌తో ఆతిధ్యాన్ని స్వీకరించారు. అయితే ఇది కేవలం స్నేహపూర్వక మీటింగే కాకుండా.. తన వ్యాపార విస్తరణ గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే చిరు, చరణ్ కాకుండా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ సీఈవో రామ్ చరణ్ ఇంటికి వెళ్లి.. కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అంతలోనే టెడ్ సరాండోస్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా భేటీ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో టెడ్‌కు ఆతిధ్యం అందించారు యంగ్ టైగర్. ఈ సమయంలో సీఈవోతో ముచ్చటించారు ఎన్టీఆర్. ఈ భేటీలో యంగ్ టైగరే కాకుండా ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్, దేవర మూవీ దర్శకుడు కొరటాల శివ  కూడా పాల్గొన్నారు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ టీంతో సెల్ఫీ తీసుకున్నారు నెట్ ఫ్లిక్స్ సీఈవో. ఇప్పుడు కేవలం ఆర్ఆర్ఆర్ నటులు రామ్ చరణ్, జూ ఎన్టీఆర్‌లను టెడ్ సరాండోస్ కలవడంపై ఆసక్తి నెలకొంది. అయితే వారితో భేటీ వెనుక కారణాలు తెలియరాలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో మంచి వ్యూస్ అందుకుంది. ఈ క్రమంలోనే వారితో భేటీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఈ భేటీ వెనుక కారణాలేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments