iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీ‌లో తీవ్ర విషాదం.. తెలుగు డైరెక్టర్ మృతి! 

  • Published Aug 02, 2024 | 2:20 PM Updated Updated Aug 02, 2024 | 2:20 PM

సినీ పరిశ్రమను విషాదాలు వీడటం లేదు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మేనమామ సూర్య నారాయణ బాబు మరణించిన సంగతి విదితమే. శేఖర్ మాస్టర్ ఇంట్లోనూ విషాదం నెలకొంది. ఇప్పుడు మరో డైరెక్టర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని మంచు మనోజ్

సినీ పరిశ్రమను విషాదాలు వీడటం లేదు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మేనమామ సూర్య నారాయణ బాబు మరణించిన సంగతి విదితమే. శేఖర్ మాస్టర్ ఇంట్లోనూ విషాదం నెలకొంది. ఇప్పుడు మరో డైరెక్టర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని మంచు మనోజ్

  • Published Aug 02, 2024 | 2:20 PMUpdated Aug 02, 2024 | 2:20 PM
ఇండస్ట్రీ‌లో తీవ్ర విషాదం.. తెలుగు డైరెక్టర్ మృతి! 

తెలుగు  ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత, మహేష్ బాబు మేనమామ సూర్యనారాయణ బాబు గుండె పోటుతో ఈ సోమవారం మరణించిన సంగతి విదితమే. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్  శేఖర్ మాస్టర్ సోదరుడు మృతి చెందారు. ఇప్పుడు మరో విషాద వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ దర్శకుడు మృతి చెందాడు. నేను మీకు తెలుసా సినిమాను డైరెక్ట్ చేస్తున్న అజయ్ శాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మంచు మనోజ్. ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.

‘ నా బెస్ట్ ఫ్రెండ్, నేను మీకు తెలుసా కెప్టెన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని కలిచివేస్తుంది. నేను పడుతున్న బాధను మాటల్లో చెప్పలేదు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని వేడుకుంటున్నా. మిస్ యు రా విజయ్, త్వరగా వె ళ్లిపోయావ్. నువ్వు మరణించావన్నది కల అయితే బాగుణ్ణు. లవ్ యూ ఫరెవర్ బాబాయ్’ అంటూ ట్వీట్ చేశాడు. మంచు మనోజ్ ఈ పోస్టు పెట్టగానే.. నెటిజన్లు ఓం శాంతి, రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood director

ఇక అజయ్ శాస్త్రి విషయానికి వస్తే.. నేను మీకు తెలుసా కన్నా ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయితగా వర్క్ చేశాడు. 12 (బారా) అనే షార్ట్ ఫిల్మ్‌తో అతడి కెరీర్ స్టార్ అయ్యింది. దీన్ని క్యాడ్ మూవీస్, రానా దగ్గుబాటి నిర్మించారు. ఆ తర్వాత రాఖీ, డేంజర్ వంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్‌గా వర్క్ చేశాడు. అలాగే యాడ్ ఫిల్మ్ మేకర్స్‌గా కూడా వ్యవహరించాడు. తన ఫ్రెండ్ మంచు మనోజ్ హీరోగా నేను మీకు తెలుసా అనే మూవీని తెరకెక్కించాడు అజయ్. 2008లో వచ్చిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్, రియా సేన్ హీరోయిన్లు. అచ్చు అందించిన సాంగ్స్ హిట్స్‌గా నిలిచాయి. అయితే అజయ్ మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş