iDreamPost
android-app
ios-app

వీడియో: విఘ్నేషన్ సర్ ఫ్రైజ్ గిఫ్ట్..ముద్దుల వర్షం కురిపించిన నయనతార!

  • Published Mar 05, 2024 | 3:39 PM Updated Updated Mar 05, 2024 | 3:39 PM

Nayanthara: హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించిన నటీమణి నయనతార. ఎన్నో ఏళ్ల నుంచి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కూడా కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nayanthara: హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించిన నటీమణి నయనతార. ఎన్నో ఏళ్ల నుంచి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కూడా కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 05, 2024 | 3:39 PMUpdated Mar 05, 2024 | 3:39 PM
వీడియో: విఘ్నేషన్ సర్ ఫ్రైజ్ గిఫ్ట్..ముద్దుల వర్షం కురిపించిన నయనతార!

బహుమతులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జ్ఞాపకాలు. వీటిని బంధువులకు, స్నేహితులు, భాగస్వామికి ఇస్తుంటారు. కొందరు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చి..తమ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ చేస్తుంటారు. కానీ సినీ, రాజకీయ రంగాల చెందిన వారివి మాత్రమే వార్తల్లో నిలుస్తుంటాయి. అలానే సెలబ్రిటీలు తమ భాగస్వామికి లేదా ఇతరులకు గిఫ్ట్స్ ఇస్తుంటారు. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్..తన వైఫ్ నయన తారకు సర్ ఫ్రైజ్ బహుమతి ఇచ్చాడు. దీంతో ఆమె.. విఘ్నేషన్ పై ముద్దుల వర్షం కురిపించింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నయనతార.. ఈమె గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను నయనతార సంపాదించింది.  ఎన్నో ఏళ్ల నుంచి సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన గా కొనసాగుతుంది. అందరూ ఈమెను లేడీ సూపర్ స్టార్ అంటారు. నయనతారకు యూత్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2022లో తమిళన దర్శకుడు విఘ్నేషన్ శివన్ ను వివాహం చేసుకుంది. వీరు సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇటీవలే ఈ దంపతులకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. నయనతార..విఘ్నేష్ శివన్ ఇన్ స్టా అకౌంట్ ను అన్ ఫాల్ చేసిందని, త్వరలో వారిద్దరు విడాకులు తీసుకోనున్నారనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో విగ్నేష్ షేర్ చేసిన వీడియో  వైరల్ గా మారింది.

నయనతార, విఘ్నేషన్ దంపతులు విడిపోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. తాజాగా విఘ్నేశ్  సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసాడు. వాళ్ల వెడ్డింగ్ యానివర్సీ సందర్భంగా నయనతారకి విఘ్నేషన్ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిటనట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. నయన్ విగ్నేష్ ఒళ్ళో కూర్చొని ఉంది. వారి ఇద్దరి పక్కన ప్రముఖ ఫ్లూటిస్ట్ నవీన్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. దీంతో నయనతార ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అతను ప్లే చేసిన ఫ్లూట్ కి  పరవశించి పోయిన నయన, విగ్నేష్ ని ముద్దులతో ముంచెత్తుతుంది.  ఇప్పడు ఈ వీడియో  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొత్తంగాఈ వీడియో నయనతార, విగ్నేష్ లు విడిపోతున్నారనే ఫేక్ వార్తకు చెక్ పెడుతుందని పలువురు అభిప్రాయ  పడుతున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş