అలా పిలిస్తే తిడుతున్నారు.. నయనతార సంచలన వ్యాఖ్యలు!

నయనతార 2003లో వచ్చిన మన్నసిన్నకారే అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2006లో వచ్చిన లక్ష్మీ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

నయనతార 2003లో వచ్చిన మన్నసిన్నకారే అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2006లో వచ్చిన లక్ష్మీ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్‌ స్పాన్‌ చాలా తక్కువ. చాలా కొద్ది మందిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలాంటి వారు స్టార్‌ హీరోయిన్లు అవుతూ ఉంటారు. అయితే, ఆ స్టార్‌డమ్‌ ఎక్కువ కాలం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవచ్చు. తక్కువ కాలంలో లైఫ్‌ ఫెయిడ్‌ అయిపోవచ్చు. కానీ, చిత్ర పరిశ్రమలో చాలా కొద్ది మంది మాత్రమే హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో లేడీ అమితాబ్‌ నయనతార ఒకరు.

ఆమె దాదాపు  20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చేస్తున్నారు. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయారు. లేడీ అమితాబ్‌ అన్న పేరుకు తగ్గట్టే ఆమె క్రేజ్‌ విరాజిల్లుతోంది. ఇక, ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్నపూరిణి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో నయన్‌ ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో లేడీ అమితాబ్‌ అన్న బిరుదుపై స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘ లేడీ అమితాబ్‌ అనకండి.. చెబితే తిడతారు. కొంతమంది నేను ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని అంటారు. అమ్మాయిని కాబట్టి విరుచుకుపడతారు. మళ్లీ నాపై విమర్శలు మొదలెడతారు. అన్నపూరణి సినిమాకు సంబంధించి అన్ని విషయాలు నాకు ఇష్టం వచ్చినట్లే జరిగాయి. లేడీ సూపర్‌స్టార్‌ అన్న టైటిల్‌ ఆ కార్డ్‌ మినహా. అది నా అనుమతి లేకుండా వేశారు. డైరక్టర్‌ను అడిగితే సర్‌ప్రైజ్‌ అన్నాడు. నిజం చెప్పాలంటే.. సూపర్‌ స్టార్‌ అంటే 10 మంది సంతోషం పడితే.. 50 మంది తిట్టుకుంటున్నారు. అలా అనిపించుకునే స్థాయికి నేను ఎదగలేదేమో..’’ అని అన్నారు.

కాగా, నయనతార జవాన్‌ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌కు జంటగా నటించారు. జవాన్‌ మూవీ ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల అయింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. టెస్ట్‌, మన్నగట్టి సిన్స్‌ 1960 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఆమె నిర్మాతగా వ్యవహరించిన గుజరాతీ సినిమా ‘ శుభ్‌ యాత్ర’ ఇదే ఏడాది థియేటర్లలోకి వచ్చింది.

నిర్మాతగా ఆమె మొత్తం ఆరు చిత్రాలు నిర్మించారు. నయన్‌ సినిమాల్లోనే కాదు.. కొన్ని మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించారు. 2022 వరకు మొత్తం 5 మ్యూజిక్‌ వీడియోల్లో కనిపించారు. మరి, నయన తార లేడీ సూపర్‌ స్టార్‌ బిరుదుపై స్పందిస్తూ.. 10 మంది సంతోషిస్తే.. 50 మంది తిట్టుకుంటారు అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Show comments