iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పండగ.. రూ. 99కే మల్టీప్లెక్స్ సినిమా టికెట్

  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
మూవీ లవర్స్ కు పండగ.. రూ. 99కే మల్టీప్లెక్స్ సినిమా టికెట్

జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా.. మూవీ లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్. నేషనల్ మూవీ డే(అక్టోబర్ 13, శుక్రవారం)న దేశవ్యాప్తంగా సినిమా పండగను నిర్వహించనున్నారు. అందులో భాగంగానే సినిమా ప్రియులకు బంపరాఫర్ ఇచ్చింది ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్. గతేడాది కూడా ఇదే రోజున భారీ ఆఫర్ ఇచ్చిన అసోసియేషన్.. ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ ధరను రూ. 99గా నిర్ణయించారు. ఈ ఆఫర్ ను మూవీ లవర్స్ అందరూ ఉపయోగించుకోవాలని వారు ఓ ప్రకటనలో కోరారు. అయితే ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లో ఉందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ మూవీ డే(అక్టోబర్ 13) శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా సినిమా పండుగను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ వారు మూవీ లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా దేశంలోని పీవీఆర్, సినీ పోలిస్, ఐనాక్స్, సిటీప్రైడ్, మిరాజ్, మూవీ టైమ్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ ఆఫర్‌ ను మూవీ లవర్స్ కు అందించనున్నాయి. ఆఫర్ లో భాగంగా మల్టీప్లెక్స్ ల్లో ఈ స్పెషల్ డే నాడు టికెట్ ధర కేవలం రూ.99 మాత్రమే. అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన టికెట్ ధరల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు.

ఇదిలా ఉండగా.. గతేడాది ఈ సినిమా పండుగలో తెలుగు రాష్ట్రాలు పాల్గొనలేదు. మరి ఈసారైనా ఈ సినిమా ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా?లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇతర ప్రాంతాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తెలిపాయి. ప్రస్తుతం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. భారీ ధరలు చూసి వెనక్కి తగ్గిన అభిమానులకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోరాయి. దేశంలో 4 వేలకు పైగా మల్టీప్లెక్స్ లు ఈ పండగలో పాల్గొంటున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap