iDreamPost
android-app
ios-app

నాకు తెలిసిన పాన్ ఇండియా స్టార్ అతనే! హీరో నాని కామెంట్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 11:57 AM, Mon - 14 August 23
  • Author ajaykrishna Updated - 11:57 AM, Mon - 14 August 23
నాకు తెలిసిన పాన్ ఇండియా స్టార్ అతనే! హీరో నాని కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్డమ్ అనేది.. ఒకే సినిమాని అన్ని భాషలలో రిలీజ్ చేయడంతో రాదు. అన్ని భాషల డైరెక్టర్స్ ఒకే హీరో కోసం కథలు రాస్తున్నారంటే.. ఆ హీరోనే అసలైన పాన్ ఇండియా స్టార్ అని అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోథా. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని ఆగష్టు 24న పాన్ ఇండియా రేంజ్ లో.. అన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్స్, ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. దుల్కర్ ని మాస్ హీరోగా ప్రెజెంట్ చేస్తుందని అంటున్నారు. కాగా.. తాజాగా హైదరాబాద్ లో కింగ్ ఆఫ్ కోథా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, హీరో రానా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా గురించి.. హీరో దుల్కర్ గురించి నాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని మాట్లాడుతూ.. “అమ్మాయిల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు హీరోలు స్టేజిపైనే ఉన్నారు. రానా, దుల్కర్ అంటే అమ్మాయిలకు పిచ్చి. తెలుగులో కూడా దుల్కర్ మెల్లగా ఎదుగుతున్నాడు. తన తెలుగు జర్నీ మొదలుపెట్టిన ‘ఓకే బంగారం’ సినిమాకు నేను వాయిస్ ఇచ్చాను. ఓ రకంగా దుల్కర్ జర్నీలో నేను కూడా భాగం అయ్యాను. మనం అంతా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా అంటున్నాం. కానీ.. నాకు ఆ పదం నచ్చదు.

అయినప్పటికీ.. నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా స్టార్ ఎవరంటే.. దుల్కర్ అనే చెప్తాను. ఎందుకంటే.. ఒక బాలీవుడ్ డైరెక్టర్ దుల్కర్ కోసం కథ రాస్తాడు.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ దుల్కర్ కోసం కథ రాస్తారు. నాకు తెలిసి అసలు పాన్ ఇండియా స్టార్ అనడానికి అర్ధం అదే కావచ్చు. సీతారామంతో తెలుగు వాడికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దుల్కర్.. ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకోవాలి. కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాని అభిలాష్ జోషి రూపొందించగా.. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. మరి దుల్కర్ గురించి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio