Somesekhar
నా నెక్ట్స్ మూవీకి పిల్లలు దూరంగా ఉండాలని నాని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి న్యాచురల్ స్టార్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం.
నా నెక్ట్స్ మూవీకి పిల్లలు దూరంగా ఉండాలని నాని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి న్యాచురల్ స్టార్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్ట్ 29న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
‘దసరా’.. నాని-శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రు. వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇక ఈ మూవీలో హింస ఎక్కువగా ఉన్న కారణంగా నాని తొలుత చిన్న పిల్లలను తీసుకెళ్లాలా? వద్దా? అని అలోచించాడట. కానీ సరిపోదా శనివారం మూవీకి మాత్రం చిన్న పిల్లలతో సహా అందరిని తీసుకెళ్తానని చెప్పాడు. అయితే ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నెక్ట్స్ మూవీలో హింస ఎక్కువగా ఉంటుందని, చిన్న పిల్లలు దూరంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా.. ఇంతకీ నాని చెప్పిన ఈ మాటలు శ్రీకాంత్ ఓదెల గురించా? లేక శైలేష్ కొలను హిట్ 3 గురించా? అంటూ అభిమానులు తెగ కన్ప్యూజ్ అయిపోతున్నారు. ఏదేమైనా నాని చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఇండస్ట్రీలో ఓ రేంజ్ హాట్ టాపిక్ గా మారాయి. మరి నాని కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
“My next movies are very intense in violence” – @NameisNani 🤯🔥
It will be #Hit3 or #NaniOdela2 💯#SaripodhaaSanivaaram #Nani pic.twitter.com/YibWT1ykBr
— MuTHU Movie updates (@Muthupalani_) September 2, 2024