Hi Nanna: బిహైండ్‌వుడ్స్‌ అవార్డ్స్ లో హాయ్ నాన్న టీమ్ హవా

నాని, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన హాయ్‌ నాన్న సినిమా అవార్డుల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు..

నాని, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన హాయ్‌ నాన్న సినిమా అవార్డుల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు..

ప్రతిష్టాత్మక బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. భారీ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ హిట్ హాయ్ నాన్న 3 అవార్డులను గెలుచుకుంది. ‘హాయ్ నాన్న’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసిన నాని.. బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ 2023 అవార్డు అందుకున్నారు. అంతే కాక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌, దర్శకుడు కూడా అవార్డులు అందుకున్నారు.

‘హాయ్ నాన్న’ చిత్రంలో నటనకు గాను మృణాల్‌ ఠాకూర్‌.. బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ నటి 2023 అవార్డును అందుకున్నారు. ‘హాయ్ నాన్న’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శౌర్యువ్‌ బిహైండ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు.

హాయ్ నాన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. హృదయాన్ని హత్తుకునే కంటెంట్, అసాధారణ నటన, అద్భుతమైన సాంకేతిక విలువలు, హై ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టడంతో.. ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంటుంది. హాయ్ నాన్న చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది.

హాయ్ నాన్న కథ:

విరాజ్ (నాని) ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఆరేళ్ల వయసున్న తన కూతురు మహి (బేబీ కియారా)తో కలిసి ముంబైలో నివసిస్తుంటాడు. కియారాకు తన తల్లి గురించి మరింత తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ విరాజ్ తన కుమార్తెకు భార్య గురించి ఎటువంటి విషయం చెప్పడు. మహి ఒక రోజు యష్నా (మృణాల్ ఠాకూర్)ను కలవడంతో విరాజ్ కొన్నేళ్లుగా దాచి ఉంచిన కథను బయటపెట్టాల్సి వస్తుంది. మహి తల్లి ఎవరు, ఆమెకు, విరాజ్ కు మధ్య అసలేం జరిగింది? యష్నా, విరాజ్ కలిసిన తర్వాత వారి మధ్య ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.

Show comments