Dasara Movie: సరికొత్త రికార్డు సృష్టించిన ‘దసరా’.. IIFAలో ఏకంగా 10 నామినేషన్స్!

దసరా మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. మెున్న ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ లో సత్తాచాటిన నాని.. ఈసారి IIFA అవార్డుల్లో సత్తా చాటాడానికి రెడీ అయ్యాడు.

దసరా మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. మెున్న ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ లో సత్తాచాటిన నాని.. ఈసారి IIFA అవార్డుల్లో సత్తా చాటాడానికి రెడీ అయ్యాడు.

న్యాచురల్ స్టార్ నాని.. సరికొత్త కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న మూవీలతో సూపర్ హిట్స్ అందుకున్న నాని.. తాజాగా హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ అనే మాస్ అండ్ యాక్షన్  మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఓ న్యూస్ నానికి బూస్ట్ ఇచ్చింది. దసరా మూవీ IIFA అవార్డుల్లో సత్తా చాటింది.

దసరా.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాని కెరీర్ లో  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో పాటుగా ఇటీవలే ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ లో అవార్డుల పంట పండించింది. తాజాగా మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. IIFA అవార్డుల బరిలో దిగి ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ అయ్యి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను దసరా మేకర్స్ ప్రకటించారు. దాంతో మరోసారి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ను దసరా మూవీ సొంతం చేసుకోబోతోందని నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ తో పాటుగా పలు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో నాని చిత్రం రిలీజ్ కు ఉన్న నేపథ్యంలో ఇలాంటి గుడ్ న్యూస్ అందడంతో సరిపోదా శనివారం టీమ్ సంతోషంలో ఉంది. ఇది సినిమాపై సానుకూలమైన ఇంపాక్ట్ చూపిస్తుందని వారు తెలుపుతున్నారు. మరి IIFA అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు దసరా మూవీ దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments