iDreamPost
android-app
ios-app

Vijayashanthi: కళ్యాణ్ రామ్ సినిమాతో విజయశాంతి ఈజ్ బ్యాక్.. పోలీస్ డ్రెస్ లో బ్లాస్టింగ్ టీజర్!

  • Published Jun 24, 2024 | 12:34 PMUpdated Jun 24, 2024 | 12:34 PM

టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి.. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేడు రాములమ్మ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.. ఇది చూసిన వారు కర్తవ్యం సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ వివరాలు..

టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి.. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేడు రాములమ్మ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.. ఇది చూసిన వారు కర్తవ్యం సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 12:34 PMUpdated Jun 24, 2024 | 12:34 PM
Vijayashanthi: కళ్యాణ్ రామ్ సినిమాతో విజయశాంతి ఈజ్ బ్యాక్.. పోలీస్ డ్రెస్ లో బ్లాస్టింగ్ టీజర్!

విజయశాంతి.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత గ్లామరస్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కర్తవ్యం సినిమాతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి వరకు హీరోయిన్‌గా, గ్లామరస్‌గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కర్తవ్యం సినిమాతో భిన్నమైన గుర్తింపు తెచ్చుకుంది. పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా స్క్రీన్‌ మీద విజృంభించింది. ఆ తర్వాత వరుసగా అలాంటి పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటిస్తూ.. లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు ఫైట్లు, యాక్షన్‌ సీన్స్‌ అంటే కేవలం హీరోలు మాత్రమే చేస్తారనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది విజయశాంతి. ఇప్పటికి ఆమె పేరు తల్చుకుకోగానే.. చాలా మందికి కర్తవ్యం సినిమాలో చేసిన పాత్రే కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ స్థాయిలో ఆమె ప్రేక్షకుల మదిలో గుర్తింపు సంపాదించుకుంది.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా.. లేడీ ఓరియెంటడ్‌ సినిమాలకు కెరాఫ్‌ అడ్రెస్‌గా కెరీర్‌లో దూసుకుపోయిన విజయశాంతి.. వివాహం తర్వత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సొంతంగా పార్టీ పెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది విజయశాంతి. ఇద్దరు బిడ్డలను దేశ రక్షణ కోసం ఆర్మీకి పంపిన తల్లిగా, అన్యాయాలను ఎదిరించే లెక్చరర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించి.. రాములమ్మ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా సరే.. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది.

ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తోన్న ఎన్‌కేఆర్‌ 21 వ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు ఎన్‌కేఆర్‌ మేకర్స్‌. ఇది చూసిన వారికి విజయశాంతి ఈజ్‌ బ్యాక్‌.. మళ్లీ కర్తవ్యం సినిమాను గుర్తు చేశారు అని కామెంట్స్‌ చేస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ 21వ సినిమాలో విజయశాంతి మరోసారి పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతుంది ఖాకీ డ్రెస్‌లో మరోసారి అల్లాడించేందుకు రెడీ అయ్యింది విజయశాంతి.

ముందుగా చీరలో కనిపించిన రాములమ్మ.. తర్వాత ఖాకీ డ్రెస్‌లో గన్‌ ఫైర్‌ చేస్తూ.. సీరియస్‌ లుక్‌లో కనిపించి.. అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. గ్లింప్స్‌ మొత్తం.. విజయశాంతి పాత్ర ఎలా ఉండనుందో వివరించేలా ఉంది. మరి ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండనుందో తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరి విజయశాంతి లుక్‌ మీకెలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి